Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదరగొట్టిన బాబర్ ఆజామ్.. ముక్కోణపు సిరీస్లో వరుసగా పాక్‌కు రెండో విజయం

Babar Azam Half Century Knock Helped Pak to second Victory against Newzealand in Tri series

ఆసియాకప్‌లో బాబర్ ఆజామ్‌ పేలవ ఫామ్ కనబర్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లాండ్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్ నుంచి అతను మంచి ఫాంలోకి వచ్చాడు. తాజాగా న్యూజిలాండ్ వేదికగా.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. బాబర్ ఆజామ్ (53 బంతుల్లో 79 పరుగులు 11ఫోర్లు నాటౌట్) రాణించి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌‌కు డేవన్ కాన్వే (32పరుగులు 31బంతుల్లో), విలియమ్సన్ (31పరుగులు 30బంతుల్లో) సరైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. వీరి వన్డే ఇన్నింగ్స్ వల్ల కివీస్ స్కోరు వేగం మందగించింది. పాకిస్తాన్ బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేశారు. అయితే చాప్‌మన్ (16 బంతుల్లో 32పరుగులు) కాసేపు ధాటిగా ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రవూఫ్ 3 వికెట్లు తీయగా.. వసీం జూనియర్, నవాజ్ తలా 2వికెట్లు తీశారు. దీంతో కివీస్ జట్టు 20ఓవర్లకు కేవలం 147పరుగులకే పరిమితమైంది.

 రిజ్వాన్, మసూద్ త్వరగానే ఔటయినా..

రిజ్వాన్, మసూద్ త్వరగానే ఔటయినా..

148పరుగుల లక్ష్య ఛేదనలో మహ్మద్ రిజ్వాన్ (4పరుగులు 12 బంతుల్లో) త్వరగానే ఔటవ్వడంతో పాకిస్థాన్‌కు గట్టి దెబ్బ పడింది. షాన్ మసూద్‌ కూడా డకౌట్ అయ్యాడు. దీంతో పాకిస్థాన్ కాసేపు స్లోగా ఆడింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ అడపాదడపా బౌండరీలు బాదాడు. షాదాబ్ ఖాన్‌ (34పరుగులు 22బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) మంచి సహకారం అందించాడు. వీరిరువు కలిసి 61పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో హైదర్ అలీ (2బంతుల్లో 10పరుగులు)తో కలిసి బాబర్ బౌండరీతో విజయలాంఛనాన్ని ముగించాడు.

అదే మా ప్లస్ పాయింట్

అదే మా ప్లస్ పాయింట్

ఇక ఈ మ్యాచ్ అనంతరం బాబర్ మాట్లాడుతూ.. 'కెప్టెన్‌గా నేను చాలా సంతోషంగా ఉన్నాను. మేము పరిస్థితులను అంచనా వేస్తూ ఆడాం. మా ప్రణాళికలను సరిగానే అమలు చేసాం. మా బౌలర్లు ఈ మ్యాచ్‌లో చాలా బాగా బౌలింగ్ చేశారు. అది మాకు ప్లస్ పాయింట్ అయింది' అని న్యూజిలాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత బాబర్ పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా బాబర్ నిలిచాడు. ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో రెండు మ్యాచ్‌లు గెలుపొందిన పాక్ టాప్ పొజిషన్లోకి వెళ్లింది. ఇక ఈ సిరీస్లో ప్రతి జట్టు మరో జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్ 2 పొజిషన్లో నిలిచిన రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి. ఫైనల్లో గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది.

ఇరు జట్లు

ఇరు జట్లు

న్యూజిలాండ్ ప్లేయింగ్ 11: డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మైఖేల్ బ్రేస్‌వెల్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, బ్లెయిర్ టిక్నర్

పాకిస్థాన్ ప్లేయింగ్ 11 : మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజామ్ (కెప్టెన్), షాన్ మసూద్, హైదర్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఆసిఫ్ అలీ, మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వాసిం జూనియర్, హారీస్ రవూఫ్, షానవాజ్ దహానీ

Story first published: Saturday, October 8, 2022, 18:33 [IST]
Other articles published on Oct 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+