Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీతో పోలికా? రిపోర్టర్‌పై బాబర్ ఆజం ఫైర్!

పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 2026 సీజన్లో భాగంగా కరాచీలోని నేషనల్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బాబర్ ఆజం నేతృత్వంలోని పెషావర్ జల్మీ జట్టు, హైదరాబాద్ కింగ్స్‌మెన్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజంకు.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ప్రశ్న ఎదురవ్వడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. బాబర్ ఆజం తన అసహనాన్ని బాహాటంగానే ప్రదర్శించడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే?
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ రిపోర్టర్ బాబర్ ఆజం ఫినిషింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ.. "విరాట్ కోహ్లీ తన జట్టును ఒంటిచేత్తో గెలిపించి.. మ్యాచ్‌లను క్లోజ్ చేసినట్టుగా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు?" అని అడిగాడు. ఈ ప్రశ్న బాబర్ ఆజంను తీవ్ర అసహనానికి గురిచేసింది. దీనికి బాబర్ ఆజం బదులిస్తూ.. "మీరు ఏ ఉద్దేశంతో ఈ ప్రశ్న అడుగుతున్నారో నాకు అర్థమవుతోంది.. ఆ చర్చను ఇక్కడితో ఆపేయండి" అంటూ బాబర్ ఘాటుగా స్పందించాడు. తాను కూడా కెరీర్లో ఎన్నో మ్యాచ్‌లను విజయవంతంగా ముగించానని.. గణాంకాలు చూస్తే ఆ విషయం అర్థం అవుతుందని బాబర్ రిపోర్టర్‌కు కౌంటర్ ఇచ్చాడు.

Babar Azam Fumes at Reporter Over Virat Kohli Comparison Controversy in PSL 2026 Press Meet

బాబర్ ఆజం స్ట్రైక్ రేట్‌పై విమర్శలు
వాస్తవానికి గత కొంతకాలంగా బాబర్ ఆజం స్ట్రైక్ రేట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీ20 క్రికెట్లో ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా ఆయన వేగంగా ఆడలేకపోతున్నాడని విమర్శల జడివాన కురుస్తోంది. ప్రస్తుత పాకిస్థాన్ సూపర్ లీగ్ సీజన్లో కూడా బాబర్ ఆజం 126.15 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. బాబర్ ఆజం 37 బంతుల్లో 43 పరుగులు చేసినప్పటికీ.. అది జట్టుకు సరిపోతుందా లేదా అనే కోణంలో రిపోర్టర్ అడిగిన ప్రశ్న బాబర్ ఆజంను ఆత్మరక్షణలో పడేలా చేసింది.

కోహ్లీ ఫామ్ vs బాబర్ ఆజం
మరోవైప, ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 173.21 స్ట్రైక్ రేట్‌తో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ తన స్ట్రైక్ రేట్‌ను పెంచుకుంటూ జట్టుకు వేగంగా విజయాలను అందిస్తుండటం.. బాబర్ మాత్రం పాత శైలిలోనే నెమ్మదిగా ఆడుతుండటంతో వీరిద్దరి మధ్య పోలికలు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి.

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
బాబర్ ఆజం ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. బాబర్ అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తూ.. గెలిచిన మ్యాచ్‌లో ఇలాంటి ప్రతికూల ప్రశ్నలు అడగడం సరికాదని వాదిస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ అభిమానులు, ఇతర క్రికెట్ విశ్లేషకులు మాత్రం.. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే బాబర్ తన ఫినిషింగ్ సామర్థ్యాన్ని, స్ట్రైక్ రేట్‌ను మెరుగుపరుచుకోవాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. బాబర్ తనపై వస్తున్న విమర్శలకు మైదానంలోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.

Story first published: Thursday, April 9, 2026, 9:51 [IST]
Other articles published on Apr 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+