Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెంచరీతో బ్యాట్ బాజా మోగించిన బాబర్ ఆజామ్.. రికార్డ్ భాగస్వామ్యంతో ఇంగ్లాండ్‌పై ఘనవిజయం

Babar Azam Fired With Century and Record Partnership with Rizwan Helps To Level the Series Against England

కరాచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ 62బంతుల్లో సెంచరీతో కదం తొక్కాడు. ఆసియాకప్ నుంచి ఫామ్ కోల్పోయిన బాబర్ ఒక్క ఇన్నింగ్స్‌తో తన మునుపటి టచ్ చూపించాడు. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి 203పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌ అందించి 10వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు.

ఇక పాకిస్థాన్ తరఫున టీ20ల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం రికార్డును కూడా వీరిద్దరు నమోదు చేశారు. 203పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించడం గమనార్హం. ఈ మ్యాచ్ విజయంతో సిరీస్ 1-1తో సమం అయింది. బాబర్ ఆజామ్ (66బంతుల్లో 110పరుగులు 11ఫోర్లు, 5సిక్సర్లు నాటౌట్) క్లాస్ అండ్ మాస్ మిక్స్ ఇన్నింగ్స్ పట్ల స్టేడియంలోని పాక్ అభిమానులు ఉర్రూతలూగారు.

విమర్శకులకు బ్యాట్‌తో సమాధానమిచ్చిన బాబర్

ఇకపోతే ఈ మ్యాచ్ ప్రారంభంలో మహమ్మద్ రిజ్వాన్ (88పరుగులు 51బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) ఇంగ్లాండ్‌కు కొన్ని ఔటయ్యే అవకాశాలను అందించాడు. 23పరుగుల వద్ద అలెక్స్ హేల్స్ క్యాచ్ డ్రాప్ చేశాడు, 32వద్ద స్టంపింగ్ మిస్సయ్యాడు. 83 మొయిన్ అలీ క్యాచ్ డ్రాప్ చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని రిజ్వాన్ కూడా సద్వినియోగం చేసుకుని చిచ్చురేపాడు. వన్-వే ట్రాఫిక్‌లో పాకిస్థాన్ ఛేజింగ్ చేసేసింది. తొలుత బాబర్ ఆజామ్ కాస్త నిదానంగా ఆడిన తన టచ్ అందుకున్నాక వీరవిహారం చేశాడు. కొన్ని అద్భుతమైన స్ట్రోక్‌ప్లే షాట్లు ప్రేక్షకుల మది దోచాయి. ఇక ఈ ఇన్నింగ్స్‌తో తన మీద ఇటీవల వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చినట్లయింది. బాబర్ అభిమానులు సైతం గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) ఇజ్ బ్యాక్, కింగ్ ఇజ్ బ్యాక్ అంటూ ట్వీట్లు, పోస్టులు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

తొలుత మొయిన్ అలీ చెలరేగడంతో

టీ20 ప్రపంచకప్ ముందు పాక్ జట్టు ఇంతటి భారీ విజయాన్ని సాధించడం ఆ జట్టు విశ్వాసాన్ని పెంచడం ఖాయం. ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ స్టాండ్ ఇన్ కెప్టెన్ మొయిన్ అలీ ఫిఫ్టీతో చెలరేగడంతో తొలుత ఇంగ్లాండ్ 5వికెట్లు కోల్పోయి 199పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో మొయిన్ అలీ (23బంతుల్లో 4సిక్సర్లు, 4ఫోర్లతో 55 పరుగులు), బెన్ డకెట్ (43), హ్యారీ బ్రూక్ (31), అలెక్స్ హేల్స్ (30) కూడా రాణించారు. చివరి 10 ఓవర్లలో ఇంగ్లండ్ 119పరుగులు పిండుకుంది. ఇక 17ఏళ్ల తర్వాత తొలిసారి ఇంగ్లాండ్ పాక్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి గేమ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయంతో తన పర్యటనను ఆరంభించింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బాబర్ ఆజామ్ నిలిచాడు.

తుది జట్లు :

పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజామ్ (కెప్టెన్), హైదర్ అలీ, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాదిర్, హారీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, షానవాజ్ దహానీ

ఇంగ్లాండ్ : ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ (కెప్టెన్), సామ్ కరాన్, డేవిడ్ విల్లీ, ల్యూక్ వుడ్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్

Story first published: Friday, September 23, 2022, 8:30 [IST]
Other articles published on Sep 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+