ఆజామూ..నీ నుండి ఇలాంటి పెర్ఫార్మన్స్ ఊహించలేదు: కోహ్లీని కూడా దాటేసాడుగా..!
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ అజామ్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. క్వెట్టా గ్లాడియేటర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో అతను శతకంతో చెలరేగి జట్టుకు కీలకంగా మారాడు. ముఖ్యంగా చివరి ఓవర్ చివరి బంతికి వేగంగా పరుగెత్తి, చాకచక్యంగా డైవ్ చేసి తన సెంచరీని పూర్తి చేయడం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. టీ20లకు అతను సరిపోడని విమర్శించిన వారికి, 192.31 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో బాబర్ గట్టి సమాధానం ఇచ్చి పాకిస్తాన్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు.
కరాచీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బాబర్ అజామ్ ఓపెనర్‌గా వచ్చి మొదటి నుంచే దూకుడుగా ఆడాడు. సాధారణంగా నిదానంగా ఆడే తన శైలిని పక్కనపెట్టి, బంతిని మైదానం నలుమూలలా చెదరగొట్టాడు. కేవలం 52 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు సాధించిన అతని ఇన్నింగ్స్‌లో 6 బౌండరీలు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి.గత మూడేళ్లుగా పెద్ద జట్లపై విఫలమవుతాడన్న విమర్శలను ఎదుర్కొన్న బాబర్, 2026 PSLలో తన ఫామ్‌ను తిరిగి చాటుకున్నాడు.

పెషావర్ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌ను క్వెట్టా బౌలర్ జహాందాద్ ఖాన్ వేశాడు. చివరి బంతికి సెంచరీ పూర్తి చేయడానికి బాబర్ అజామ్‌కు 2 పరుగులు అవసరమయ్యాయి. బంతిని కొట్టిన వెంటనే అతను వేగంగా పరుగెత్తి, రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి డైవ్ చేస్తూ తన శతకాన్ని పూర్తి చేశాడు.బాబర్‌కు అండగా నిలిచిన కుశల్ మెండీస్ 44 బంతుల్లో 83 పరుగులు చేసి మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 75 బంతుల్లో 135 పరుగులు జోడించారు.
🚨REMEMBER When Gautam Gambhir Said🗣️:- Agar aik Player Hundred k Kareeb Ja kar 4 balls leta hai to wo team ky liye 20 runs kam Kar raha hai
— SheR•ALI (@Sher__Ali) April 19, 2026
-This is what Babar Azam did Today, took 5 balls to Complete personal Milestone
this mindset needs to be ended 🙏 pic.twitter.com/A9bgob3wRO
ఈ శతకంతో బాబర్ అజామ్ కెరీర్‌లో పలు చారిత్రక రికార్డులను సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా అతను నిలిచాడు. కేవలం 338 ఇన్నింగ్స్‌లలోనే ఈ అరుదైన మైలురాయిని చేరుకుని రికార్డు నెలకొల్పాడు.వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (344 ఇన్నింగ్స్‌లు), భారత స్టార్ విరాట్ కోహ్లీ (360 ఇన్నింగ్స్‌లు) సాధించిన రికార్డులను అతను అధిగమించాడు. వారిద్దరి కంటే వేగంగా ఈ ఘనత సాధించాడు.
They sidelined this guy from T20is for intent and replaced him with those who should have played around him. Meanwhile he continues to dominate and the players who replaced him are failing badly in every way possible.
— Abdullah. (@Abdullahh_56) April 19, 2026
BABAR AZAM THE MAN YOU AREEE..!! 🙇♂️🔥 pic.twitter.com/sGHTtXIFbm
ప్రస్తుత 2026 PSL టోర్నమెంట్‌లో బాబర్ అజామ్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతను ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌లలో 401 పరుగులు చేశాడు. ఈ సెంచరీ తర్వాత అతని బ్యాటింగ్ సగటు ఏకంగా 100.25కి చేరింది. టీ20 మ్యాచ్‌లలో దూకుడుగా పరుగులు సాధించగల తన సామర్థ్యాన్ని బాబర్ అజామ్ సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి నిరూపించుకుని విమర్శకుల నోళ్లను మూయించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications