
బాబర్ సమాధానం..
తను మ్యాచ్ మొదటి నుంచి ఫలితం కోసమే ప్రయత్నిస్తామని చెప్తూ వచ్చానని పాక్ సారధి బాబర్ ఆజమ్ అన్నాడు. క్రికెట్‌లో ఏమైనా జరగొచ్చని, అందుకే ఛాన్సులు తీసుకోవాలని అనుకున్నామని చెప్పాడు. తమ జట్టు బలం బ్యాటింగే అన్న బాబర్.. తొలి ఇన్నింగ్సులో అద్భుతంగా ఆడామని అభిప్రాయపడ్డాడు. 'నేను టాస్ సమయంలోనే చెప్పా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా ఫలితం వచ్చేలా చూస్తామని.
అందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశా. కానీ లైట్ సరిగా లేకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది. మా ఐదో బౌలర్ సల్మాన్ ఆఘాకు బాగలేదు. దీంతో అతన్ని చాలా మిస్ అయ్యాం. మా ఐదుగురు బౌలర్ల ఎటాక్ చాలా బాగుంది. వసీమ్, సవూద్ అద్భుతంగా ఆడి అవకాశాలు సృష్టించారు. మంచి ఆట ఆడినందుకు వాళ్లను మెచ్చుకోవాల్సిందే' అని బాబర్ చెప్పాడు.

ఓడినంత పని చేసిన పాక్
ఈ మ్యాచులో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆ జట్టు ఆలౌట్ అయింది. బదులుగా కివీస్ అద్భుతంగా ఆడింది. టామ్ లాథమ్ సెంచరీతో ఆకట్టుకోగా.. ఇటీవల కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలోనే నాలుగో రోజున 612/9 స్కోరు వద్ద న్యూజిల్యాండ్ జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పాక్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే 311/8 స్కోరు ఉండగా.. బాబర్ ఆజమ్ తాము ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో కివీస్ ముందు 138 పరుగుల లక్ష్యం నిలిచింది. అదే చివరి రోజు కావడంతో ఈ లక్ష్యాన్ని 15 ఓవర్లలో న్యూజిల్యాండ్ ఛేదించాల్సి వచ్చింది.

లైట్ లేకపోవడం కాపాడింది..
ఛేజింగ్‌ను న్యూజిల్యాండ్ ధాటిగా ఆరంభించింది. మైకేల్ బ్రేస్‌వెల్ (3) విఫలమైనా మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (16 బంతుల్లో 18 నాటౌట్), టామ్ లాథమ్ (24 బంతుల్లో 35 నాటౌట్) ధాటిగా ఆడారు. ఇన్నింగ్స్ ఇలాగే కొనసాగితే కివీస్ గెలిచేలా కనిపించింది.
అయితే మరో 7-8 ఓవర్లు ఉన్నాయనగా.. లైట్ సరిగా లేదని భావించిన అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. దీంతో పాకిస్తాన్ బతికిపోయింది. దీన్నే ఎత్తి చూపుతున్న ఫ్యాన్స్.. బెన్ స్టోక్స్ చేసినట్లు బాబర్ కూడా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. స్టోక్స్‌ది ధైర్యం అయితే బాబర్‌ది పిచ్చి తనం అని మండి పడ్డారు.


Click it and Unblock the Notifications












