NZ vs PAK Babar Azam: పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజం న్యూజిలాండ్‌పై 83 బంతుల్లో 78 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ బాబర్ ఆజం పాకిస్థాన్ జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. బాబర్ ఆజం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ పాకిస్థాన్ న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో 73 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే బాబర్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఓ ప్రత్యేక ఘనతను సాధించాడు.
ఇది వన్డే క్రికెట్‌లో బాబర్ ఆజంకు 55వ అర్థ సెంచరీ. ఈ ఘనతతో ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఐదో పాకిస్థానీ క్రికెటర్‌గా యూనిస్ ఖాన్‌తో కలిసి బాబర్ ఆజం నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ 93 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంజమామ్ తర్వాత 77 హాఫ్ సెంచరీలు చేసిన మహ్మద్ యూసుఫ్, సయీద్ అన్వర్ 63, జావేంద్ మియాందాద్ 58 అర్థ సెంచరీలు చేశారు.

ఒత్తిడిలో బాబర్ ఆజం
ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో బాబర్ ఆజం ప్రదర్శన బాగా లేకపోవడంతో వన్డే సిరీస్‌కు ముందు అతను చాలా ఒత్తిడిలో ఉన్నాడని గమనించాలి. ఈ క్రమంలో టీ20 జట్టు నుంచి బాబర్ ఆజం తొలగించబడ్డాడు. కానీ వన్డేలలో బాబర్ ఆజం రాణించినా పనిని పూర్తి చేయలేకపోయాడు. రిజ్వాన్ ప్రదర్శన కూడా పేలవంగా ఉంది. కివీస్‌తో తొలి వన్డే మ్యాచ్‌లో కీపర్-బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్ ప్రదర్శన నిరాశపరిచింది. రిజ్వాన్ 34 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇటీవలే టీ20 కెప్టెన్ గా నియమితుడైన సల్మాన్ ఆఘా 58 పరుగులు చేశాడు. కానీ సల్మాన్ ఆఘాకు మరో ఎండ్ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. చివరి ఆరుగురు బ్యాట్స్‌మెన్ మొత్తం మూడు పరుగులు చేయడం చాలా ఆందోళన కలిగించే విషయం.
తనదైన ముద్రవేసిన మార్క్ చాప్‌మన్
న్యూజిలాండ్ అంతర్జాతీయ బౌలర్ నాథన్ స్మిత్ నాలుగు వికెట్లు పడగొట్టి తన పనిని పూర్తి చేశాడు. మార్క్ చాప్‌మన్ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో తన మూడో వన్డే సెంచరీని సాధించాడు. మార్క్ చాప్‌మన్ డారిల్ మిచెల్‌తో కలిసి 199 పరుగల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 344 పరుగులు చేసింది. మార్క్ చాప్‌మన్ 111 బంతుల్లో 132 పరుగులు చేయగా.. డారిల్ మిచెల్ 76 పరుగులు చేశాడు. అరంగేట్రం చేసిన మహ్మద్ అబ్బాస్ 26 బంతుల్లో 52 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతకు ముందు పాకిస్థాన్ అంతర్జాతీయ టీ-20 సిరీస్ లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.