SL vs PAK 2nd Test: లడ్డూ లాంటి క్యాచ్‌లు మిస్ చేసిన బాబర్ ఆజామ్, వరస్ట్ ఫీల్డర్ అంటూ కామెంట్లు

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ప్రస్తుతం కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గాలేలో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో అతను తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించి సత్తా చాటాడు. ఇక తొలి టెస్టులో అబ్దుల్ షఫీక్ సైతం సెంచరీతో రాణించడంతో.. నాలుగు వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. ఇకపోతే 27ఏళ్ల బాబర్ ఆజామ్ రెండో టెస్టులో ఫీల్డింగ్ పరంగా చెత్త ప్రదర్శన కనబరిచాడు. గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టు మొదటి రోజు రెండు సులువైన క్యాచ్‌లను జారవిడిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 52వ ఓవర్లో ఫామ్‌లో ఉన్న ఏంజెలో మాథ్యూస్ ఇచ్చిన క్యాచ్‌ను బాబర్ ఆజామ్ నేలపాలు చేశాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ నౌమన్ అలీ బౌలింగ్లో మాథ్యూస్ కవర్ డ్రైవ్ ఆడాడు. అయితే అది ఎక్స్‌ట్రా కవర్ దిశగా వెళ్లగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న బాబర్ చేతుల్లోకి నేరుగా బంతి వెళ్లింది. అయితే బాబర్ ఆ ఈజీ క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. ఈ క్యాచ్ మిస్ వల్ల పాక్‌కు పెద్ద నష్టమేమీ జరగలేదు. మాథ్యూస్ మరో ఏడు ఓవర్ల తర్వాత ఔటయిపోయాడు.
డిక్వెల ఇచ్చిన లాలిపాప్ క్యాచ్‌ను
ఆ తర్వాత 82వ ఓవర్‌లో బాబర్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా లాలిపాప్ లాంటి క్యాచ్ వదిలేశాడు. నిరోషన్ డిక్వెల్లా 23బంతుల్లోనే 24 పరుగులు చేసి దూకుడుగా ఆడుతున్న టైంలో.. నసీమ్ షా బౌలింగ్లో డ్రైవ్ ఆడగా.. బాల్ బంతికి ఎడ్జ్ అయి నేరుగా స్లిప్‌లోకి వెళ్లింది. బాబర్ దాన్ని ఈజీగా అందుకునే పొజిషన్లో ఉన్నాడు. కానీ బూగ లాంటి క్యాచ్‌ను సైతం పాక్ కెప్టెన్ జారవిడిచాడు. డిక్వెల్లా తొలి రోజు ఆట ముగిసేవరకు క్రీజులో నిలబడ్డాడు. అతను ప్రస్తుతం ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 42పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక అతను ఎలాంటి ఇన్నింగ్స్ ఆడతాడో మరీ.
బాబర్ ఏం దేవుడు కాదు.. మందలించాల్సిందే
బాబర్ రెండు ముఖ్యమైన, సులవైన క్యాచ్‌లను జారవిడవడంతో పాక్ అభిమానులు అతనిపై తీవ్రంగా సీరియస్ అవుతున్నారు. బ్యాటింగ్ ఒక్కటే కాదు కాస్త ఫీల్డింగ్ మీద దృష్టి సారించాలని బాబర్‌కు సూచించారు. బాబర్ ప్రస్తుతం చెత్త ఫీల్డర్‌గా తయారయ్యాడంటూ కొందరు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. సరిగా ఫీల్డింగ్ చేయకపోతే బాబర్ అయితే ఏంటీ.. అతన్ని కూడా మందలించాల్సిందే.. అతనేం దేవుడు కాదు మరికొందరు ట్విట్టరులో విమర్శలు గుప్పిస్తున్నారు.
పట్టు సాధిస్తున్న శ్రీలంక
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు 86ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి శ్రీలంక 315పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఓషాదో ఫెర్నాండో (50పరుగులు), కెప్టెన్ దిముత్ కరుణరత్నే (40పరుగులు), ఏంజెలో మాథ్యూస్ (42), దినేష్ చండిమాల్ (80), ధనుంజయ డిసిల్వా (33) రాణించారు. ప్రస్తుతం క్రీజులో నిరోష్ డిక్వెల్లా (42), దునిత్ వెల్లలాగే (6) క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నారు. పాక్ బౌలర్లలో మహమ్మద్ నవాజ్ 2, యషీర్ షా, నషీమ్ షా, నౌమన్ అలీ తలా ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌కు షాహిన్ అఫ్రిది దూరమైన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications