Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి డకౌట్ కావడం ఈ తీవ్ర విమర్శలకు కారణమైంది.
'కూలి' ఫీవర్.. రిస్క్ తీసుకుని రజనీ సినిమా చూశాను: స్టార్ క్రికెటర్
ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తూ వన్డే సిరీస్ ఆడుతోంది. దీనిలో భాగంగా ట్రినిడాడ్‌లోని బ్రయాన్ లారా స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు తడబడింది. పాకిస్థాన్ జట్టులోని కీలక ఆటగాడు బాబర్ ఆజం 9వ ఓవర్లో యువ పేసర్ జేడెన్ సీల్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 3 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ షాక్ నుంచి కోలుకోని పాకిస్థాన్ జట్టు వర్షం కారణంగా ప్రభావితమైన ఈ మ్యాచ్‌లో చివరికి ఓటమిపాలైంది. దీంతో వెస్టిండీస్ జట్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం ఈ పేలవమైన ఆటతీరు అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. సోషల్ మీడియాలో అతడిని "ఓవర్ రేటెడ్" అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా బాబర్ ఆజం జింబాబ్వే, నేపాల్ వంటి చిన్న జట్లపై మాత్రమే పరుగులు చేస్తాడని, బలమైన జట్లపై విఫలమవుతాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "నో నేపాల్, నో పార్టీ ఫర్ స్టాట్‌ప్యాడర్" అనే హ్యాష్‌టాగ్ ట్రెండ్ చేసి అభిమానులు అతడిని ఎగతాళి చేస్తున్నారు.
బాబర్ ఆజం చివరిసారిగా 2023లో ఆసియా కప్‌లో నేపాల్ జట్టుపైనే సెంచరీ చేశాడని, ఆ తర్వాత ఒక్క సెంచరీ కూడా చేయలేదని అభిమానులు గణాంకాలతో సహా విమర్శిస్తున్నారు. మరికొందరు అభిమానులు, "బాబర్ ఆజామ్ సెంచరీని కేవలం 100 పరుగులతో మిస్ చేసుకున్నాడు" అని వ్యంగ్యంగా పోస్ట్ చేస్తున్నారు. మొదటి వన్డేలో 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ.. ఈ రెండో మ్యాచ్‌లో డకౌట్ అవ్వడం, జట్టు ఓటమికి ఒక కారణం కావడంతో బాబర్ ఆజామ్‌పై ఒత్తిడి మరింత పెరిగింది.