Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జయసూర్య వాటే బౌలింగ్.. బాబర్ ఆజామ్ ఇలా ఔటవుతానని కలలో కూడా అనుకోని ఉండడు..!

Babar Azam Clean Bowled for A Mistery Delivery By Prabhat Jayasuriya

గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో కుశాల్ మెండిస్‌ను పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా.. షేన్ వార్న్ తరహాలో ఔట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆట నాలుగో రోజు శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య సైతం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను ఓ మిస్టరీ బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అసలు ఇలా ఔట్ అవుతానని బాబర్ కలలో కూడా ఊహించి ఉండడేమో. ప్రభాత్ జయసూర్య తన మిస్టరీ స్పిన్‌తో లెగ్ సైడ్ వైడ్ వేయగా.. బాబర్ ఆ బంతిని లీవ్ చేశాడు. స్టప్ తిన్నాక బాల్ అనూహ్యంగా స్పిన్ అయి వికెట్లను గిరాటేసింది. దీంతో బాబర్ ఔటయి పెవిలియన్ బాట పట్టాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో తొలి ఇన్నింగ్స్‌లో వీరోచిత 119పరుగులు చేసిన బాబర్ ఆజామ్.. రెండో ఇన్నింగ్స్‌లో (55 పరుగులు) హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. ఇక 4వ రోజు పాకిస్థాన్ విజయ లక్ష్యాన్ని ఛేదించే దిశగా సాగుతుంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో 342పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 222పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ దినేష్ చండిమాల్ (76పరుగులు) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఇక పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో ప్రభాత్ జయసూర్య 5వికెట్లతో రాణించడంతో టాపార్డర్ కుప్పకూలింది. అయితే కెప్టెన్ బాబర్ ఆజామ్ అద్భుతమైన సెంచరీతో టెయిలెండర్లతో కలిసి విలువైన భాగస్వామ్యం నమోదు చేయడంతో పాక్ 218పరుగులు చేయగలిగింది. ఇక నాలుగు పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. ఓషద ఫెర్నాండో (64), కుసల్ మెండిస్ (76) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో పాటు చండిమాల్ (94) రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో 337పరుగులు చేసింది. తద్వారా పాకిస్థాన్‌కు 342పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక నిర్దేశించింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌కు మంచి ఆరంభం లభించింది. రమేష్ మెండిస్ బౌలింగ్‌లో ఇమామ్-ఉల్-హక్ (35) స్టంపౌట్ కావడంతో తొలి వికెట్‌కు 87పరుగుల ఓపెనింగ్ పార్ట్ నర్ షిప్‌కు తెరపడింది. తర్వాత అజహర్ అలీ (6) సైతం వెంటనే ఔటయ్యాడు. అయితే కెప్టెన్ బాబర్ ఆజామ్ (55), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ (112నాటౌట్) మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చివర్లో బాబర్‌ను ప్రభాత్ ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో మహ్మద్ రిజ్వాన్ (7), షఫీక్ ఉన్నారు. పాక్ గెలవడానికి ఇంకా 120పరుగులు అవసరం కాగా.. శ్రీలంక గెలవడానికి 7వికెట్లు అవసరం చివరి రోజు ఏం జరుగుతుందో మరీ.

Story first published: Tuesday, July 19, 2022, 20:56 [IST]
Other articles published on Jul 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+