Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్‌కప్: పాక్ తరుపున తొలి హాఫ్ సెంచరీ, బాబర్ ఆజాం రికార్డు

Babar Azam becomes the first Pakistan batsman to score a half-century in CWC 2019

హైదరాబాద్: నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డేలో పాకిస్థాన్ బ్యాట్స్‌మ‌న్ బాబ‌ర్ ఆజ‌ాం హాఫ్ సెంచ‌రీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో బాబ‌ర్ ఆజాం 51 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ఈ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ తరుపున తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కాగా, బాబర్ ఆజాంకు వన్డేల్లో ఇది 13వ హాఫ్ సెంచరీ. ఇటీవ‌ల ఇంగ్లాండ్‌తో జ‌రిగిన గ‌త ఐదు వ‌న్డేల్లో బాబ‌ర్ ఆజాం అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

పాక్ ఓపెనర్లు చక్కటి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించిన తర్వాత ఫకర్ జమాన్ 40 బంతుల్లో 36(6 ఫోర్లు) మొయిన్ అలీ బౌలింగ్‌లో స్టంపౌట్ ఔట‌య్యాడు. కీప‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ అద్భుతంగా స్టంపింగ్‌కు ఫాకర్ జమాన్ పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజాంతో కలిసి మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ స్కోరు బోర్డుని నడిపించాడు. అయితే, జట్టు స్కోరు 111 పరుగుల వద్ద మొయిన్ అలీ బౌలింగ్‌లో ఇమామ్ ఉల్ హాక్ 58 బంతుల్లో 44 (3 పోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ ముంగిట క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఆఫ్ స్టంప్‌కు దూరంగా మెయిన్ అలీ వేసిన బంతిని ఇమామ్ ఉల్ హాక్ అమాంతం గాల్లోకి లేపాడు. అదే సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న క్రిస్ వోక్స్ పరుగెత్తుకొచ్చి బంతిని అందుకోవడం స్టేడియంలో ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేసిన వోక్స్‌ డైవ్‌కొట్టి మరీ ఒడిసి పట్టుకున్నాడు.

1
43649

దీంతో పాకిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. ఇమామ్ ఉల్ హక్ ఔటైన తర్వాత క్రీజులోకి మహ్మద్ హఫీజ్ వచ్చాడు. మరోవైపు హాఫ్ సెంచరీ అనంతరం జట్టు స్కోరు 198 పరుగుల వద్ద బాబర్ అజాం 66 బంతుల్లో 63(4 ఫోర్లు, 1 సిక్స్) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. దీంతో పాక్ మూడో వికెట్ కోల్పోయింది.

ప్రస్తుతం 35 ఓవర్లకు గాను పాకిస్థాన్ 3 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ హఫీజ్(52), సర్ఫరాజ్ అహ్మద్(7) పరుగులతో ఉన్నారు.

Story first published: Monday, June 3, 2019, 17:48 [IST]
Other articles published on Jun 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+