Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా బాబర్ ఆజామ్.. అత్యధిక విజయాలతో తొలిస్థానంలో.. అతని తర్వాత ఎవరెవరంటే?

Babar Azam Became the Most Successful Captain for Pakistan, He surpassed SarfaRaz Khan

గురువారం కరాచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన 2వ టీ20లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ (110నాటౌట్‌) సెంచరీతో అదరగొట్టి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ రికార్డు సృష్టించింది. 10వికెట్ల తేడాతో విజయం 200పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ అనంతరం బాబర్ ఆజామ్ పొట్టి క్రికెట్లో విజయవంతమైన పాకిస్థాన్ కెప్టెన్‌గా నిలిచాడు.

బాబర్ ఆజామ్ కెప్టెన్సీలో పాక్ 30వ టీ20 విజయాన్ని సాధించింది. తద్వారా సర్ఫరాజ్ అహ్మద్‌ను అధిగమించాడు. బాబర్ టీ20 ఫార్మాట్‌లో 49మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా.. 30విజయాలు సాధించాడు. సర్ఫరాజ్ 2016 నుంచి 2019 మధ్య 37మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించి 29విజయాలను పాక్‌కు అందించాడు. ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో విజయం తర్వాత బాబర్ సర్ఫరాజ్ రికార్డును బద్దలు కొట్టాడు.

 విరాట్ కోహ్లీ రికార్డు సమయం చేసిన ఆజామ్

విరాట్ కోహ్లీ రికార్డు సమయం చేసిన ఆజామ్

అలాగే బాబర్ ఆజామ్ కెప్టెన్సీ విజయాల విషయంలో విరాట్ కోహ్లీ (30)తో సమమయ్యాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి ఆ తర్వాత మిగతా ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కోహ్లీ 50 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా.. 30విజయాలు సాధించాడు. ఎంఎస్ ధోనీ 72మ్యాచ్‌లలో 41విజయాలతో భారత అత్యంత విజయవంతమైన టీ20 కెప్టెన్‌గా కొనసాగుతుండగా.. రోహిత్ శర్మ 40 మ్యాచ్‌లలో 31విజయాలతో 2వ స్థానంలో ఉన్నాడు.

 బాబర్ కెప్టెన్సీలోనే పాక్.. భారత్‌ను ఓడించింది

బాబర్ కెప్టెన్సీలోనే పాక్.. భారత్‌ను ఓడించింది

బాబర్ 2019లో పాకిస్తాన్ టీ20I కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. పాక్ తరఫున సమర్థవంతమైన నాయకుడిగా ప్రస్తుతం చెలామణీ అవుతున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ కెప్టెన్సీ భారం వల్ల ఏమాత్రం ఇబ్బంది పడకుండా టన్నుల కొద్దీ రన్స్ చేస్తూనే ఉన్నాడు. బాబర్ కెప్టెన్సీలో.. పాకిస్తాన్ జట్టు ప్రపంచ కప్ మ్యాచ్‌లో తొలిసారిగా భారత్‌ను ఓడించింది. గత సంవత్సరం టీ20 ప్రపంచ‌కప్‌లో పాక్ జట్టు సెమీ-ఫైనల్‌ వరకు చేరుకుంది. ఈ సంవత్సరం ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచింది.

పాకిస్తాన్ కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించినవారు

పాకిస్తాన్ కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించినవారు

బాబర్ ఆజామ్ - 49 మ్యాచ్‌ల్లో 30 విజయాలు

సర్ఫరాజ్ అహ్మద్ - 37 మ్యాచ్‌ల్లో 29 విజయాలు

షాహిద్ అఫ్రిది - 43 మ్యాచ్‌ల్లో 19 విజయాలు

మహ్మద్ హఫీజ్ - 29 మ్యాచ్‌ల్లో 18 విజయాలు

షోయబ్ మాలిక్ - 20 మ్యాచ్‌ల్లో 13 విజయాలు

పాక్ తరఫున టీ20ల్లో రెండు సెంచరీలు

పాక్ తరఫున టీ20ల్లో రెండు సెంచరీలు

టీ20లలో రెండు సెంచరీలు చేసిన మొదటి పాకిస్తాన్ బ్యాటర్‌గా కూడా బాబర్ కొత్త రికార్డును సృష్టించాడు. బాబర్ 2021లో సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాపై 122పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లాండ్‌పై గురువారం 110నాటౌట్‌తో సెంచరీ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 199పరుగులు చేసింది.

ఇక 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. ఓపెనర్లు కెప్టెన్ బాబర్ ఆజామ్ 62బంతుల్లో సెంచరీతో కదం తొక్కాడు. ఆసియాకప్ నుంచి ఫామ్ కోల్పోయిన బాబర్ ఒక్క ఇన్నింగ్స్‌తో తన మునుపటి టచ్ చూపించాడు. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి 203పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌ అందించి 10వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు. బాబర్ (66బంతుల్లో 110పరుగులు 11ఫోర్లు, 5సిక్సర్లు నాటౌట్) క్లాస్ అండ్ మాస్ మిక్స్ ఇన్నింగ్స్ పట్ల స్టేడియంలోని పాక్ అభిమానులు ఉర్రూతలూగారు.

Story first published: Friday, September 23, 2022, 16:02 [IST]
Other articles published on Sep 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+