Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్తాన్​ వన్డే జట్టుకు కొత్త కెప్టెన్​.. సర్ఫ్‌రాజ్‌కు ఉద్వాసన!!

Babar Azam appointed Pakistans new ODI captain

లాహోర్​: స్టార్ బ్యాట్స్‌మన్‌ బాబర్ ఆజమ్ పాకిస్థాన్ వన్డే జట్టు కెప్టెన్​గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టీ20 కెప్టెన్​గా ఉన్న బాబర్.. ఇప్పడు వన్డే కెప్టెన్సీ కూడా దక్కించుకున్నాడు. మాజీ కెప్టెన్ సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ స్థానంలో బాబర్ వన్డే సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఇక టెస్ట్‌ కెప్టెన్‌గా అజర్‌ అలీ కొనసాగనున్నాడు.

ప్రస్తుతం ప్రపంచంలో స్టార్​ బ్యాట్స్​మన్​గా కొనసాగుతున్న బాబర్ ఆజమ్​ గతేడాది సర్ఫరాజ్ అహ్మద్‌ నుంచి టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. ఇప్పుడు వన్డేలకు సైతం సారథిగా నియమితుడయ్యాడు. 'కెప్టెన్లుగా కొనసాగనున్న అజల్ అలీ, బాబర్ ఆజమ్‌కు నా అభినందనలు. ఇది సరైన నిర్ణయం. భవిష్యత్తులో బాధ్యత, పాత్రపై వారికి పూర్తి స్పష్టత ఉంది. ఆశించిన స్థాయిలో వారు రాణిస్తారని నేను నమ్ముతున్నా' అని పాకిస్థాన్ హెడ్​కో చ్​, చీఫ్ సెలెక్టర్​ మిస్బా ఉల్ హక్ అన్నాడు.

2020-21 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితాను పీసీబీ ప్రకటించింది. 18 మంది ప్లేయర్ల కాంట్రాక్టులో కొత్తగా ఇద్దరికి చోటు దక్కింది. నసీమ్‌ షా, ఇఫ్తికార్‌ అహ్మద్‌లు రాగా... హసన్‌ అలీ, ఆమిర్, వహాబ్‌ రియాజ్‌లకు కాంట్రాక్టు దక్కలేదు. ఇమామ్, మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, యాసిర్‌ షాల కాంట్రాక్టు గ్రేడ్‌ తగ్గించారు. వీళ్లంతా 'బి' కేటగిరీకి పడిపోయారు.

పిన్న వ‌య‌సులోనే త‌న పేస్‌తో ఆక‌ట్టుకుంటున్న షాహీన్ షా అఫ్రిదికి అజ‌హ‌ర్ అలీ, బాబ‌ర్ ఆజ‌మ్‌ల‌తో పాటు గ్రేడ్ ఏలో చోటుద‌క్క‌డం విశేషం. మొత్తంగా ఈ గ్రేడ్‌లో ఉన్నది ముగ్గురే. ఈ కాంట్రాక్టు జూలై 1 నుంచి వచ్చే జూన్‌ దాకా అమల్లో ఉంటుంది. బాబర్ ఆజమ్ కెప్టెన్​గానూ తన సత్తా నిరూపించుకుంటాడని ఆ దేశ మాజీ ఆటగాడు మహమ్మద్ యూసుఫ్​ విశ్వాసం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్​ ఓ వెలుగు వెలుగుతున్న అతడు సారథ్యంలోనూ రాణిస్తాడని బుధవారం ట్వీట్ చేశాడు. బాబర్ ప్రస్తుతం టీ20ల్లో అగ్ర ర్యాంకులో ఉండగా.. వన్డేల్లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Thursday, May 14, 2020, 8:01 [IST]
Other articles published on May 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+