Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అఫ్ఘాన్ చేతిలో ఓటమితో.. బాబర్, రిజ్వాన్‌ గౌరవం పెరుగుతుంది: పాక్ కెప్టెన్

Babar and Rizwan will get respect says Pak captain after series loss

అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి పాకిస్తాన్‌పై అఫ్ఘానిస్తాన్ ఒక సిరీస్ నెగ్గింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో సీనియర్లు లేని పాకిస్తాన్‌ను అఫ్ఘాన్ చిత్తుచేసింది. తొలి రెండు మ్యాచుల్లో అద్భుతమైన పోరాటం కనబరిచిన అఫ్ఘాన్ టీం చరిత్ర సృష్టించింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ కేవలం 92 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ నబీ అద్భుతంగా పోరాడి తమ జట్టుకు విజయం అందించాడు.

రెండో మ్యాచులో కూడా రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ చివరకు విజయం మాత్రం అఫ్ఘానిస్తాన్‌నే వరించింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు 132 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో కొంత చెమటోడ్చిన అఫ్ఘాన్ బ్యాటర్లు చివరకు మరో రెండు బంతులు మిగిలుండగా విజయం సాధించారు. దీంతో తొలిసారి పాకిస్తాన్‌పై అఫ్ఘాన్ ఒక సిరీస్ నెగ్గి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఘనత సాధించిన తొలి అఫ్ఘాన్ కెప్టెన్‌గా రషీద్ ఖాన్ కూడా రికార్డు సృష్టించాడు.

ఇక మూడో మ్యాచ్‌లో మాత్రం పాకిస్తాన్ చెలరేగింది. ఈ మ్యాచ్‌లో కూడా ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 182 పరుగుల భారీ స్కోరు చేసింది. సైమ్ అయూబ్ (49), కెప్టెన్ షాదాబ్ ఖాన్ (28) రాణించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో అఫ్ఘాన్ జట్టు విఫలమైంది. ప్రధాన బ్యాటర్లు ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు 18.4 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయం కేవలం పాక్ పరువు నిలబెట్టేందుకే ఉపయోగపడింది.

ఈ సిరీస్ ఓటమి గురించి మాట్లాడిన పాక్ సారధి షాదాబ్ ఖాన్.. దీని వల్ల ప్రేక్షకులకు సీనియర్ల విలువ తెలుస్తుందని చెప్పాడు. మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ వంటి ఆటగాళ్లు లేకపోవడం వల్లనే ఇలా ఓడిపోయామని అన్నాడు. ఈ పరాజయంతో వాళ్లిద్దరికీ ప్రజలు, మీడియాలో గౌరవం పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. 'యువకులకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేం అనుకున్నాం. పీఎస్ఎల్‌లో మంచి ఇన్నింగ్సులు ఆడిన వారికి అవకాశం ఇచ్చాం. కానీ అనుభవం కూడా చాలా ముఖ్యం కదా' అని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, March 28, 2023, 10:10 [IST]
Other articles published on Mar 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+