ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌కి కోపం వచ్చింది. దీంతో ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న ఆయన.. మధ్యలోనే వెళ్లిపోయారట. ఎందుకంటే. అజారుద్దీన్‌కు చిర్రెత్తుకొచ్చే ప్రశ్నవేశారట ఈ ఛానల్ మీడియా ప్రతినిధి.
దీనికి వివరాలిలా ఉన్నాయి.. అజహర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం మే 13వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమం నిమిత్తం చిత్ర బృందంతో పాటు అజహర్ కూడా పాల్గొంటున్నారు.
ఆయా కార్యక్రమాలకు హాజరవుతున్న మీడియా ప్రతినిధులు తరచుగా 'మ్యాచ్ ఫిక్సింగ్‌లో మీరు డబ్బు తీసుకున్నారా? లేదా?' అని అజహర్ ను అడుగుతున్నారుట. ఈ ప్రశ్నతో చికాకు, కోపానికి గురవుతున్న అజహర్ అర్థాంతరంగా ఆయా కార్యక్రమాల నుంచి వెళ్లిపోతున్నాడు.

తాజాగా ఓ జాతీయ మీడియా ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలోనూ అజహరుద్దీన్ మధ్యలోనే వెళ్లిపోవడంతో మీడియా ప్రతినిధితోపాటు మిగితా వారు నిర్ఘాంతపోయారు. అయితే, అలా వెళ్లవద్దని, లాజిక్‌గా సమాధానం చెప్పి తప్పించుకోమని ఆ చిత్ర యూనిట్ ఆయనకు చెప్పినప్పటీకి అజహర్ పట్టించుకోవట్లేదట.
మీడియా ఆ ప్రశ్న అడిగినప్పడు.. 'ఈ సినిమా చూస్తే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది' అని చెప్పమని అజహర్‌కు చిత్ర యూనిట్ చెప్పిందని సమాచారం. ఈ ప్రశ్న అడుగుతారేమోనని అనుమానంతో ఒక ప్రముఖ ఛానెల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక షో కి అజహర్ హాజరుకాలేదని బాలీవుడ్ వర్గాల సమాచారం.
కాగా, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో అజహరుద్దీన్‌పై బిసిసిఐ 2000ల సంవత్సరంలో జీవితకాల నిషేధం విధించింది. అయితే, 2012లో అజహరుద్దీన్‌పై నిషేధించడం విధించడం చట్ట సమ్మతం కాదని, అతనిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశించింది.