అందుకే కాలర్ ఎగరేసేవాడిని: అజహర్(పిక్చర్స్)
బెంగళూరు/హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ మైదానంలో తనదైన శైలిలో వ్యవహరించేవాడు. విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పే అజహరుద్దీన్.. మైదానంలో తరచూ తన కాలర్ ఎగరేసేవాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అజహరుద్దీన్ ఇలా తరచూ ఎక్కువగా చేసేవాడు.
అయితే, మైదానంలో అజహరుద్దీన్ కాలర్ ఎందుకు ఎగరేసేవాడో ఎవరికీ తెలియదు. అయినా, చాలా మంది యువ ఆటగాళ్లు ఈ విషయంలో అజహరుద్దీన్ ను అనుకరించడం మొదలుపెట్టారు. కాగా, ఇదొక స్టైల్ అని చాలా మంది అనుకునేవారు.
ఈ విషయంపై తాజాగా స్పందించిన అజహరుద్దీన్.. సూర్య కిరణాలు పడకుండా మాత్రమే తాను తరచూ తన కాలర్‌ను ఎగరేసేవాడినని తెలిపాడు. మెడపై ఎండపడినప్పుడు కాస్త చిరగ్గా అనిపించేదని, అందుకే తన కాలర్‌తో మెడను కవర్ చేసేవాడనని చెప్పాడు. ఇలా తరచూ చేస్తుండటంతో ఇదొక అలవాటుగా మారిపోయిందని వివరించాడు.
అంతేగాక, తాను తెలుపు హెల్మెట్ ఎందుకు వాడతాననే విషయంపై కూడా అజహరుద్దీన్ స్పందించారు. టెస్టులు ఆడే సమయంలో తనకు వైట్ హెల్మెట్ వాటమంటేనే ఇష్టమని చెప్పాడు. అప్పుడు నీలిరంగు హెల్మెట్ వాడాలనే బలవంతం లేదని తెలిపాడు. దీంతో తెలుగు హెల్మెట్ నే వాడినట్లు తెలిపాడు
కాగా, 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అజహరుద్దీన్‌పై.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బిసిసిఐ నిషేధం విధించింది. అంతకుముందు అజహరుద్దీన్ నాయకత్వంలో టీమిండియా 1992, 1996, 1999 ప్రపంచ కప్ టోర్నీల్లో పాల్గొంది. ఒకసారి సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. కాగా, అజహరుద్దీన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ఏప్రిల్ 13న విడుదలైంది. మంచి టాక్ సొంతం చేసుకుంది.

అజహర్
భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ మైదానంలో తనదైన శైలిలో వ్యవహరించేవాడు.

అజహర్
విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పే అజహరుద్దీన్.. మైదానంలో తరచూ తన కాలర్ ఎగరేసేవాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అజహరుద్దీన్ ఇలా తరచూ ఎక్కువగా చేసేవాడు.

అజహర్
అయితే, మైదానంలో అజహరుద్దీన్ కాలర్ ఎందుకు ఎగరేసేవాడో ఎవరికీ తెలియదు. అయినా, చాలా మంది యువ ఆటగాళ్లు ఈ విషయంలో అజహరుద్దీన్ ను అనుకరించడం మొదలుపెట్టారు. కాగా, ఇదొక స్టైల్ అని చాలా మంది అనుకునేవారు.

అజహర్
ఈ విషయంపై తాజాగా స్పందించిన అజహరుద్దీన్.. సూర్య కిరణాలు పడకుండా మాత్రమే తాను తరచూ తన కాలర్‌ను ఎగరేసేవాడినని తెలిపాడు. మెడపై ఎండపడినప్పుడు కాస్త చిరగ్గా అనిపించేదని, అందుకే తన కాలర్‌తో మెడను కవర్ చేసేవాడనని చెప్పాడు. ఇలా తరచూ చేస్తుండటంతో ఇదొక అలవాటుగా మారిపోయిందని వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications