Azhar Mahmood: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన చాలా కాలంగా పేలవంగా ఉంది. జట్టు నిరంతరం ఓటమిని ఎదుర్కొంటోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డబ్ల్యూటీసీ 2025-27 కొత్త సైకిల్‌ను దృష్టిలో ఉంచుకుని ఒక కీలక మార్పు చేసింది. బోర్డు అజహర్ మహమూద్‌ను పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ జట్టు తాత్కాలిక హెడ్ కోచ్‌గా నియమించింది. జాతీయ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన అజహర్ మహమూద్.. చాలా కాలంగా జట్టు వ్యూహాత్మక కోర్ బృందంలో కీలక సభ్యుడిగా ఉన్నారు. అజహర్ మహమూద్ పాకిస్థాన్ టెస్ట్ జట్టును ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాడని.. ఆయన నాయకత్వంలో జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్‌లో బాగా రాణిస్తుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విశ్వసిస్తోంది. ఆయన కౌంటీ ఛాంపియన్‌షిప్ రికార్డు బాగానే ఉంది. అజహర్ మహమూద్ నాయకత్వంలోని జట్టు 2 టైటిళ్లను గెలుచుకుంది. ఆయన కూతురు కూడా ఇంగ్లండ్‌లోని క్లబ్‌లో క్రికెట్ ఆడుతున్నారు.
అజహర్ మహమూద్ ఎవరు?
50 ఏళ్ల అజహర్ మహమూద్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్. అజహర్ మహమూద్ టెస్ట్ కెరీర్ 4 సంవత్సరాలు, వన్డే కెరీర్ 11 సంవత్సరాలు కొనసాగింది. అజహర్ మహమూద్ 2003లో ఎబా ఖురేషీని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ 1999 ప్రపంచకప్ సమయంలో కలుసుకున్నారు. అజహర్ మహమూద్ భార్య ఎబా ఖురేషీ బ్రిటీష్ పౌరురాలు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి కుమార్తె ఇనా ఇంగ్లాండ్ మహిళా క్లబ్ సర్రే తరపున క్రికెట్ ఆడుతకుంది. అజహర్ స్వయంగా తన కుమార్తెకు క్రికెట్ శిక్షణ ఇచ్చాడు.

అజహర్ మహమూద్ క్రికెట్ కెరీర్
అజహర్ మహమూద్ 1975 ఫిబ్రవరి 28న రావల్పిండిలో జన్మించాడు. అజహర్ ఆల్‌రౌండర్ కావడం గమనార్హం. అజహర్ మహమూద్ 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఒక సంవత్సరం తర్వాత 1997లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అజహర్ మహమూద్ టెస్ట్ కెరీర్ 4 సంవత్సరాలు, వన్డే కెరీర్ 11 సంవత్సరాలు కొనసాగింది. అజహర్ మహమూద్ 21 టెస్టులు, 143 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో వరుసగా 39, 123 వికెట్లు పడగొట్టాడు. వన్డేలలో 3 సార్లు 5 వికెట్ హాల్ సాధించాడు.