ఎలా?: పాకిస్థాన్ బౌలింగ్ కోచ్‌గా అజర్ మహమూద్
లాహోర్: పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అజర్ మహమూద్ ఆ దేశ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. రెండు సంవత్సరాల పాటు అజర్ మహమూద్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ మేరకు అతడితో ఒప్పందం కుదుర్చుకుంది.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్ పర్యటనతో అతడు బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈనెల 17 నుంచి పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్ తో పాకిస్థాన్ జట్టు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.

ఈ రెండు టెస్టు మ్యాచ్‌లు క్రిస్ట్ చర్చ్, హామిల్టన్‌లలో జరగనున్నాయి. ఫిబ్రవరిలో జరిగిన ఆసియా కప్ సందర్భంగా ముస్తాక్ అహ్మాద్ స్ధానంలో అజర్ మహమూద్‌ను తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా పాక్ బోర్డు నియమించింది.
అయితే ఇప్పుడు అజర్ మహమూద్ సేవలను పూర్తిగా ఉపయోగించుకోవాలని పాక్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు అజర్ మహమూద్ రిటైర్మెంట్ ప్రకటించినా జులై 2016 వరకు ఇంగ్లీషు కంట్రీ క్లబ్ సుర్రేలో ప్లేయర్‌గా కొనసాగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications