హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్థాన్ జట్టుకు స్వదేశంలో మంగళవారం ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్థాన్ ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆనందకరమైన క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
పాకిస్థాన్ ఓపెనల్ అజార్ అలీ భారత క్రికెటర్లకు సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. తమ విలువైన సమయాన్ని తన కుమారులతో గడిపినందుకు క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు అని ట్విటర్‌లో అలీ పేర్కొన్నాడు.
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ పైనల్ అనంతరం ఈ ముగ్గురితో తన కుమారులు ఫోటోలు దిగారు. తమ సమయాన్ని ఫోటోలు దిగేందుకు కేటాయించినందుకు అలీ చాలా సంతోషంగా ఉన్నాడు. తన కుమారులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అలీ ట్విటర్‌లో ఉంచాడు.
ఇరు దేశాల మధ్య వైరం ఉన్నప్పటికీ మైదానం బయట, లోపల ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తితో మెలిగారంటూ ఈ ఫొటోలను చూసిన పలువురు సెలబ్రిటీలు ట్వీట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఫైనల్‌కి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ ధోని... పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ కుమారుడిని ఎత్తుకున్న ఫొటో కూడా సోషల్‌మీడియాలో వైరల్ అయింది.