Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో ఆటగాడు: మెల్‌బోర్న్‌లో చరిత్ర సృష్టించిన పాక్ క్రికెటర్

హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అజహర్ అలీ డబుల్ సెంచరీ (205 నాటౌట్) నమోదు చేశాడు. 310/6 ఓవర్ నైట్ స్కోరుతో బుధవారం ఆటను కొనసాగించిన పాకిస్థాన్ ఆటగాళ్లు వేగంగా ఆడి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు.

364 బంతులను ఎదుర్కొన్న అజహర్ అలీ 20 ఫోర్ల సాయంతో 205 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అలీకి మద్దుతుగా సోహైల్ ఖాన్‌ 65 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ (65)ని సాధించాడు. వీరిద్దరూ కలిసి ఎనిమిదో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

పరుగుల రాబట్టే క్రమంలో సోహైల్ రనౌట్ కావడం, ఆ వెంటనే రియాజ్‌ను హాజెల్‌వుడ్ పెవిలియన్‌కు చేర్చడంతో పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌ను 443/9 వద్ద డిక్లేర్ చేసింది. బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజైన బుధవారం పాక్ ఇన్నింగ్స్‌లో అజహర్ అలీ డబుల్ సెంచరీ చేయగా, సోహైల్ ఖాన్, అసద్ షఫీఖ్ అర్ధసెంచరీలను నమోదు చేశారు.

Azhar Ali just misses MCG test record as Pakistan take control of second test

కాగా ఆస్ట్రేలియా బౌలర్లలో బర్డ్‌, హాజెల్‌వుడ్‌లు చెరో మూడు వికెట్లు తీసుకోగా స్టార్క్, స్పిన్నర్ లియాన్‌‌లు చెరో వికెట్ తీసుకున్నారు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అజహర్ అలీ డబుల్ సెంచరీ సాధించడంతో ఒకే ఏడాది రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి పాక్ క్రికెటర్ గానూ రికార్డు నెలకొల్పాడు.

మరోవైపు మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పలు రికార్డులను సైతం అజహర్ అలీ నమోదు చేశాడు. పాకిస్ధాన్ జట్టు నుంచి ఈ స్డేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా అజహర్ అలీ చరిత్రి సృష్టించాడు. గతంలో పాక్ ఆటగాడు మాజిద్ ఖాన్ 158 పరుగుల రికార్డుని ఈ ఇన్నింగ్స్‌లో అజహర్ అలీ అధిగమించాడు.

ఇక మెల్‌బోర్న్ స్డేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో ఆటగాడిగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 1984లో వెస్డిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ చేసిన 208 పరుగులే ఇక్కడ ఇప్పటివరకు అత్యధిక స్కోరు కావడం విశేషం.

అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్:
*208 - Viv Richards (West Indies), 1984
*205 నాటౌట్ - Azhar Ali (Pakistan), 2016
*204 - Aubrey Faulkner (South Africa), 1910
*200 - Wally Hammond (England), 1928
*195 - Virender Sehwag (India), 2003

ఈ స్డేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు బ్యాట్స్‌మెన్:
*307 - Bob Cowper, 1966
*270 - Don Bradman, 1937
*268 - Graham Yallop, 1983
*257 - Ricky Ponting, 2003
*250 - Justin Langer, 2002
*208 - Viv Richards (West Indies), 1984
*205no - Azhar Ali (Pakistan), 2016
*205 - Neil Harvey, 1953
*205 - Bill Lawry, 1968
*204 - Aubrey Faulkner (South Africa), 1910

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+