అజహర్ అలీ అరుదైన ఘనత: ఐదో క్రికెటర్‌గా గుర్తింపు
హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెటర్ అజహర్ అలీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక కేలండర్ ఇయర్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో అజహర్ అలీ ఈ అరుదైన ఘనతను సాధించాడు.
అంతక ముందు పాకిస్థాన్ తరుపున మోసిన్ ఖాన్, ఇంజమామ్ ఉల్ హక్, యూసఫ్, యూనిస్ ఖాన్‌లు ఒక కేలండర్ ఇయర్‌లో వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలో యూనిస్ ఖాన్, ఇంజమామ్ ఉల్ హక్‌లు రెండుసార్లు వెయ్యి పరుగుల మైలురాయిని సాధించారు.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో పాక్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించిన 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మెల్ బోర్న్‌లో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలిరోజు పదే పదే వర్షం పడటంతో 50.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. సమీ అస్లామ్(9), బాబర్ అజమ్(23) యూనిస్ ఖాన్(21), మిస్బావుల్ హక్(11)లు పెవిలియన్‌కు చేరుకోగా ప్రస్తుతం క్రీజులో అజహర్ అలీ (66 బ్యాటింగ్), అసద్ షఫిక్(8 బ్యాటింగ్)తో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్సన్ బర్డ్ రెండు, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్ చెరో వికెట్ తీశారు.
పాకిస్థాన్ జట్టు తరుపున 1000కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు:
* మోసిన్ ఖాన్ - 1982లో 1029 పరుగులు
* ఇంజమామ్ ఉల్ హక్ - 2000లో 1090 పరుగులు
* ఇంజమామ్ ఉల్ హక్ - 2005లో 1000 పరుగులు
* మహ్మాద్ యూసఫ్ - 2006లో 1788 పరుగులు
* యూనిస్ ఖాన్ - 2006లో 1179 పరుగులు
* యూనిస్ ఖాన్ - 2014లో 1064 పరుగులు
* అజహర్ అలీ - 2016లో 1016 నాటౌట్ పరుగులు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications