Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌ 2018: అశ్విన్‌తో కలిసి పని చేయడం లాభదాయకమే

 Axar Patel is excited to play with Ravichandran Ashwin

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ రవిచంద్రన్‌ అశ్విన్‌తో కలిసి పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్‌ పటేల్‌ పేర్కొన్నాడు. ఈ ఏడాది ప్లేయర్‌ రిటెన్షన్‌లో పంజాబ్‌ జట్టు అట్టిపెట్టుకున్న ఏకైక ఆటగాడు అక్షర పటేల్ కావడం విశేషం.

ప్లేయర్‌ రిటెన్షన్‌ ప్రాసెస్‌లో భాగంగా అక్షర పటేల్‌ను రూ. 6.75 కోట్లకు తన వద్దే అట్టి పెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం పంజాబ్ జట్టు మెంటార్‌ వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఏడాది ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎంపిక చేసినట్లు ఫేస్‌బుక్‌లో వెల్లడించాడు.

అశ్విన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై అక్షర్‌ పటేల్‌ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అధికారిక వెబ్‌సైట్ kxip.in‌కు ఇచ్చిన ఇంటర్యూలో 'నేను భారత జట్టులో అరంగేట్రం చేసినప్పటి నుంచి నాకు అశ్విన్‌ తెలుసు. తెలిసిన వ్యక్తితో కలిసి పని చేయడం మనకెప్పుడు లాభదాయకమే' అని అన్నాడు.

'క్రికెట్‌లో అశ్విన్‌కు ఎంతో అనుభవం ఉంది. ఇప్పుడు అతను కెప్టెన్‌గా బాధ్యతలు అందుకోవడం సంతోషంగా ఉంది. ఒక బౌలర్‌ ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉంటే ఎంతో మంచిది. అశ్విన్‌ అటాకింగ్‌ బౌలర్‌. వికెట్లు తీయడంలో దిట్ట. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్లు పరుగులు సాధించకుండా, ఒత్తిడి పెంచడం నా పని' అని తెలిపాడు.

'గతంలోనూ మేమిద్దరం ఇదే చేశాంఇదే పద్ధతిని ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ విజయాల కోసం కొనసాగిస్తాం. బ్యాట్స్‌మెన్‌ ఏ విధంగా ఆలోచిస్తాడో బౌలర్‌కు తెలుస్తుంది. దీనిని ఆసరాగా చేసుకుని మ్యాచ్‌లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ విజయాలు సాధించొచ్చు' అని అక్షర్‌ పటేల్‌ వివరించాడు.

Story first published: Friday, March 2, 2018, 12:06 [IST]
Other articles published on Mar 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+