Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత స్టార్ ఆటగాడికి గాయం.. సూపర్-4కు ముందు బిగ్ టెన్షన్!

ఆసియా కప్ 2025లో సూపర్-4కు చేరుకున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఒమన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో తలకు గాయం కావడంతో అక్షర్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇది సెప్టెంబర్ 21న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుతో జరగబోయే కీలకమైన సూపర్-4 మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.

క్యాచ్ పట్టే క్రమంలో గాయపడిన అక్షర్ పటేల్
అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్, ఒమన్‌ను 21 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో ఒమన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఈ సంఘటన జరిగింది. శివమ్ దూబే వేసిన బంతిని హమ్మద్ మీర్జా కట్ చేయగా.. బంతి బ్యాట్ అంచుకు తగిలి గాల్లోకి లేచింది. మిడ్-ఆఫ్ నుంచి పరుగెత్తుకు వచ్చిన అక్షర్ పటేల్ బంతిని అందుకోవడానికి ప్రయత్నించాడు. అయితే రెండు సార్లు అతని చేతుల నుంచి బంతి జారిపోయింది. చివరికి క్యాచ్ మిస్సయింది. ఈ క్రమంలో అక్షర్ పటేల్ తల నేలకు గట్టిగా తగిలింది. దీంతో అక్షర్ తీవ్రమైన నొప్పితో బాధపడుతూ వెంటనే మైదానం నుంచి బయటకు వెళ్లాడు. ఒమన్ ఇన్నింగ్స్ ముగిసే వరకు అతను తిరిగి రాలేదు.

Axar Patel Injury Update Will the Indian All-Rounder Play Against Pakistan in Super-4

అక్షర్ కీలక ఆటగాడు
అక్షర్ పటేల్ భారత జట్టుకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఈ టోర్నమెంట్‌లో అక్షర్ పటేల్ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లలో 3 వికెట్లు తీశాడు. ముఖ్యంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఒమన్ తో జరిగిన మ్యాచ్లో కూడా బ్యాటింగ్ చేసి 26 పరుగులు చేసి తన విలువను చాటుకున్నాడు. అంతే కాకుండా ఈ టోర్నమెంట్లో అక్షర్ పటేల్ 4.38 ఎకానమీతో భారత బౌలర్లలో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. సూపర్-4లో పాకిస్థాన్ తో జరగబోయే కీలకమైన మ్యాచ్ కు ముందు అక్షర్ పటేల్ గాయం టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది.

పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడతాడా? కోచ్ కీలక అప్‌డేట్
అక్షర్ పటేల్ సెప్టెంబర్ 21న పాకిస్థాన్‌తో జరిగే కీలకమైన సూపర్-4 మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనే విషయంపై ఇప్పుడు భారత ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ స్పందించారు.భారత ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ మాట్లాడుతూ.. అక్షర్ పటేల్ ప్రస్తుతం బాగానే ఉన్నారని అన్నారు. కానీ అక్షర్ పటేల్ గాయం ఎంత తీవ్రమైనదో, లేదా పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడతాడో లేదో మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. ఈ విషయంలో మరింత సమాచారం ఇవ్వకుండా దాటవేశారు.అక్షర్ పటేల్ టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుకు ఒక మ్యాచ్ విన్నర్‌గా ఎదిగాడు. కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్‌లో అతను ఆడకపోతే అది టీమిండియాకు ఒక పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. అక్షర్ పటేల్ గాయంపై పూర్తి క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.

Story first published: Saturday, September 20, 2025, 9:38 [IST]
Other articles published on Sep 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+