అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టుపై అద్భుత విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అక్షర్ పటేల్‌కు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో విఫలమైనందుకు అక్షర్ పటేల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది.
ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22ను ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది మొదటి తప్పిదం కావడంతో, కేవలం కెప్టెన్‌కు మాత్రమే జరిమానా విధించారు. తదుపరి మ్యాచ్‌ల్లో కూడా ఇదే తప్పు పునరావృతమైతే కెప్టెన్‌తో పాటు జట్టు సభ్యులకు కూడా జరిమానా పడే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (56), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (59*) అద్భుతంగా రాణించడంతో పంజాబ్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారీ రెండేసి వికెట్లు పడగొట్టి పంజాబ్‌ను కొంతమేర కట్టడి చేశారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో లుంగీ ఎంగిడి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ స్కోరు 210 వద్ద ఆగిపోయింది.
అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే తడబడింది. 74 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కెప్టెన్ అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) బాధ్యతాయుతంగా ఆడి అర్ధసెంచరీలతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఔటైన తర్వాత అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేవలం 19 ఓవర్లలోనే 216 పరుగులు చేసి ఢిల్లీకి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో తమ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications