న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లోనే విచిత్రపు ఔట్: ఎలా ఔటయ్యాడో చూడండి (వీడియో)

By Nageshwara Rao
Axar Patel dismisses Ryan Sidebottom in a bizarre manner, thanks to assist from fielders helmet- watch video

హైదరాబాద్: ఇప్పటివరకు క్రికెట్‌లో మనం ఎన్నో రకాల ఔట్లను చూసి ఉంటాం. అయితే ఈ ఔట్ మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా బ్యాట్స్‌మన్ క్యాచ్‌ ఔట్‌, రనౌట్‌, ఎల్బీడబ్ల్యూ ఔటవుతాడు. కానీ కింది వీడియోలో బ్యాట్స్‌మన్‌ విచిత్రంగా ఔటయ్యాడు. ఇదే జరిగింది ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో.

ఔట్ ఎలా అయ్యాడబ్బా!: క్రికెట్‌లోనే వింత వీడియోని పోస్ట్ చేసిన యువీఔట్ ఎలా అయ్యాడబ్బా!: క్రికెట్‌లోనే వింత వీడియోని పోస్ట్ చేసిన యువీ

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా వార్‌విక్‌షైర్‌-దుర్హాం జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ అక్షర్‌ పటేల్‌ దుర్హాం జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో వార్‌విక్‌షైర్‌ ఆటగాడు రేయాన్‌ సైడ్‌బోటమ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఔటైన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జట్టు స్కోరు 199 పరుగుల వద్ద అక్షర్‌ పటేల్ బౌలింగ్‌లో రేయాన్‌(1) పెవిలియన్‌కు చేరాడు. ఇన్నింగ్స్ 66వ ఓవర్లో అక్షర్‌ పటేల్ వేసిన నాలుగో బంతిని రేయాన్‌ ఎదుర్కొన్న బంతి ఫీల్డర్‌ హెల్మెట్‌కు తగిలి పైకి లేచింది. అదే సమయంలో అక్కడే ఉన్న బౌలర్‌ అక్షర్‌ పటేల్‌ చక్కటి సమయస్ఫూర్తితో ఆ బంతిని అందుకున్నాడు.

దీంతో అతడు పెవిలియన్‌‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. కాగా, యూఏఈ వేదికగా జరగబోయే సెప్టెంబర్ 16 నుంచి ఆసియా కప్‌ టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో అక్షర్‌ పటేల్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Saturday, September 8, 2018, 14:38 [IST]
Other articles published on Sep 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X