Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతడి వల్లే గెలిచాం: అక్షర్ పటేల్

ఐపీఎల్ 2026 సీజన్లో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించడం ద్వారా ఢిల్లీ ప్లేఆఫ్ రేసులో నిలిచింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోయి ఉంటే ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చేది. ఈ కీలక విజయం తర్వాత కెప్టెన్ అక్షర్ పటేల్ తన జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నానని.. తాము ఒక మంచి జట్టు అని నిరూపించుకున్నామని హర్షం వ్యక్తం చేశాడు.

రికార్డు స్థాయిలో ఛేజింగ్
ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఈ స్కోరును ఛేదించడం అంత సులభం కాదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ అక్షర్ పటేల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. సీనియర్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ మరో హాఫ్ సెంచరీతో మెరవడంతో ధర్మశాల స్టేడియం చరిత్రలోనే అతిపెద్ద రన్ ఛేజ్‌ను ఢిల్లీ పూర్తి చేసింది.

Axar Patel Credits Madhav Tiwari for Delhi Capitals Thrilling Win Against Punjab Kings in IPL 2026

మాధవ్ తివారీ ఆల్‌రౌండ్ షో
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసిన మాధవ్ తివారీ అద్భుతమైన ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. పార్ట్-టైమ్ బౌలర్ అయినప్పటికీ.. కెప్టెన్ అక్షర్ పటేల్ అతడిని నమ్మి 4 ఓవర్లు బౌలింగ్ చేయించాడు. మాధవ్ తివారీ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కాన్లీ వంటి కీలక వికెట్లు తీసి పంజాబ్ స్కోరు వేగాన్ని అడ్డుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌లోనూ కేవలం 8 బంతుల్లో 18 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్స్) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మేము సరైన సమయంలో పుంజుకున్నాం: అక్షర్ పటేల్
మ్యాచ్ గెలిచిన తర్వాత అక్షర్ పటేల్ మాట్లాడుతూ.."గత కొన్ని మ్యాచ్ లుగా మేము కీలక సమయాల్లో విఫలమవుతున్నామని చెబుతున్నాను. కానీ మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం. ఈ మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితుల్లో పుంజుకోవడం సంతోషంగా ఉంది. మొదట బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చినప్పటికీ.. మిడిల్ ఓవర్లలో మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి మమ్మల్ని తిరిగి ఆటలోకి తెచ్చారు. బ్యాటింగ్‌లో యువ ఆటగాళ్లు బాధ్యత తీసుకోవడం జట్టు భవిష్యత్తుకు మంచి సంకేతం" అని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ విజయంతో తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Story first published: Tuesday, May 12, 2026, 8:07 [IST]
Other articles published on May 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+