INDvsSL: సూపర్ ఇన్నింగ్స్‌తో రికార్డులు బద్దలు కొట్టిన అక్షర్ పటేల్!

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మ్యాచ్ ఓడినా కూడా అతని ఇన్నింగ్స్ చూసిన భారత అభిమానులు శభాష్ అంటూ మెచ్చుకున్నారు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా ఏడో స్థానంలో బరిలో దిగిన అతను కేవలం 31 బంతుల్లోనే 65 పరుగులు సాధించి జట్టును దాదాపు గెలిపించినంత పని చేశాడు. ఈ క్రమంలో అతను కొన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. అవేంటో ఒకసారి పరిశీలిస్తే..

ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో తను ఎదుర్కొన్న తొలి 8 బంతుల్లో అక్షర్ 8 పరుగులే చేశాడు. అయితే ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిన అతను మరో 12 బంతుల్లోనే మిగతా 42 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా టీ20ల్లో తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీనికోసం అతను కేవలం 20 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇది భారత్ తరఫున ఐదో వేగవంతమైన హాఫ్ సెంచరీ. అదే సమయంలో 6 అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆటగాళ్లలో అయితే ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.

అత్యధిక సిక్సర్లు
తన సూపర్ ఇన్నింగ్స్‌లో అక్షర్ ఆరు భారీ సిక్సర్లు బాదాడు. శ్రీలంక స్పిన్నర్లపై ఎదురు దాడికి దిగిన అతను ఎడా పెడా సిక్సర్లు బాదేశాడు. ముఖ్యంగా హసరంగ వేసిన 14వ ఓవర్లో అయితే వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. ఇలా 7 అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి భారత్ తరఫున ఒక టీ20 మ్యాచ్‌లో ఇన్ని సిక్సర్లు మరే బ్యాటరూ కొట్టలేదు. ఇంతకుముందు దినేష్ కార్తీక్ కూడా ఏడో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చి నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు అక్షర్ ఆ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

తొలి హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో కేవలం 31 బంతులే ఎదుర్కొన్న అక్షర్ పటేల్ ఏకంగా 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తన తొలి అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. అంతేకాదు భారత్ తరఫున ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా కూడా నిలిచాడు. ఇంతకుముందు వరకూ ఈ రికార్డు రవీంద్ర జడేజా పేరిట ఉండేది. అతను కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 23 బంతుల్లో 44 పరుగులో అజేయంగా నిలిచాడు. ఇప్పుడు అక్షర్ అతన్ని కూడా అధిగమించి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒక భారతీయ బ్యాటర్.. టీ20ల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications