
హైదరాబాద్: రెండు నెలలు పాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం కశ్మీర్‌లో భారత ఆర్మీతో కలిసి విధులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. భారత ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని కశ్మీర్‌లో పారామిలటరీ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ.. మరోవైపు విరామ సమయంలో తోటి సైనికులతో చాలా చక్కగా కలిసిపోతున్నాడు.
స్టీవ్ స్మిత్‌కు సరైన మొగుడు అతడే!
ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్ యూనిట్‌లో ధోనీ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆగస్టు 15వ తేదీ దాటిన తర్వాత ధోని ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ధోని భార్య సాక్షి ఒక గిఫ్ట్‌తో అతడిని సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధమైంది. ధోనికి ఎంతో ఇష్టమైన 'ఎ జీప్ గ్రాండ్ చెరోకీ' అనే అద్భుతమైన కారును కొన్న సాక్షి ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
"నీ కోసం సరికొత్త టాయ్ ఎదురు చూస్తోంది. త్వరలో ఇంటికి రాబోతున్న నీకు వెల్‌కమ్. నీకిష్టమైన రెడ్ బీస్ట్ ఇంటికొచ్చింది. నిన్న నేను చాలా మిస్సవుతున్నా. ఇండియాలోనే ఇది తొలి కారు" అంటూ సాక్షి కామెంట్ పోస్టు చేసింది. ఇదిలా ఉంటే, ధోనీ ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజు లద్దాక్‌లోని లేహ్‌లో భారత జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసి.. జమ్ముకశ్మీర్, లద్దాక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లోని ప్రతి గ్రామంలో జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ధోనీ లద్దాక్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండడం విశేషం.
కాగా ధోనికి కార్లన్నా, బైకులన్నా ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ధోని వద్ద ఫెరారీ 599 జీటీవో, హమ్మర్ హెచ్2, జీఎంసీ సీరా వంటి కార్లు ఉండగా బైకుల్లో.. కవాసాకి నింజా హెచ్2, కాన్ఫిడరేట్ హెల్‌కాట్, బీఎస్ఎలు ఉన్నాయి.