క్యాబ్ అధ్యక్షుడిగా దాల్మియా కుమారుడు.. సెక్రటరీగా దాదా సోదరుడు!!

కోల్‌కతా: కోల్‌కతా క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా అవిషేక్ దాల్మియా ఎన్నికయ్యారు. బుధవారం అవిషేక్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, దివంగత జగ్‌మోహన్ దాల్మియా కుమారుడే అవిషేక్. జగ్‌మోహన్ దాల్మియా గతంలో క్యాబ్ అధ్యక్షుడిగా, ఐసీసీ ప్రెసిడెంటుగా కూడా సేవలందించిన విషయం తెలిసిందే. 38 ఏళ్లకే క్యాబ్ అధ్యక్ష పీఠంలో కూర్చొని, ఈ పదవి దక్కించుకున్న పిన్నవయస్కుడిగా అవిషేక్ నిలిచారు.
మరోవైపు క్యాబ్ ముఖ్య కార్యదర్శిగా స్నేహాశిష్ గంగూలీ ఎంపికయ్యారు. స్నేహాశిష్ టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సోదరుడు కావడం విశేషం. ఎన్నిక అనంతరం అవిషేక్, స్నేహాశిష్ ఇద్దరినీ బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ అభినందించారు. ఎంపికైన క్యాబ్ నూతన కార్యవర్గానికి ప్రముఖ క్రికెటర్లు, క్యాబ్ మాజీ కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదివరకే క్యాబ్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నిర్వర్తించిన అవిషేక్.. జస్టిస్ లోధా సిఫార్సుల మేరకు క్యాబ్ అధ్యక్ష పదవిలో 2021 నవంబర్ 6వరకే కొనసాగే అవకాశం ఉంది. 22 నెలల తర్వాత క్యాబ్‌లో ఆరేళ్ల పదవీ బాధ్యతలు పూర్తికానుండడంతో.. అవిషేక్ కూలింగ్ పీరియడ్ నిబంధన ప్రకారం పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
గంగూలీ బీసీసీఐలో పగ్గాలు చేపట్టిన తరువాత క్యాబ్ ప్రెసిడెంట్ పదవి అప్పటినుండి ఖాళీగానే ఉంది. బుధవారం ఆ ఖాళీలను భర్తీ చేసారు. అవిషేక్ దాల్మియా క్యాబ్ 18వ అధ్యక్షుడయ్యారు. అతని తండ్రి జగ్‌మోహన్ దాల్మియా గతంలో రెండు పర్యాయాలు పదవిలో ఉన్నారు. 'ఈడెన్ ఓ దేవాలయం అని నా బాల్యం నుండే మా నాన్న గారు చెప్పేవారు. ఆ సెంటిమెంట్ ఎల్లప్పుడూ నాతో ఉంటుంది. ఈడెన్ గార్డెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రెసిడెంట్ పదవిలో కూర్చోవడం నిజంగా భావోద్వేగంగా ఉంది. గత అధ్యక్షులతో నన్ను పోల్చుకుంటే.. నా గణాంకాలు భిన్నంగా ఉన్నాయి' అని అవిషేక్ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications