Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDW Vs AUSW: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా పేస్ బౌల‌ర్!!

AUSW vs INDW 3rd ODI: Indian pacer Jhulan Goswami Completes 600 Career Wickets

మెక్‌కే: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత మహిళా జట్టు వన్డే సిరీస్‌ను విజయంతో ముగించింది. 3 వన్డేల సిరీస్‌ను 2-1తో కోల్పోయినా.. ఓ గొప్ప పని చేసింది టీమిండియా. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు 26 వన్డేల వరుస విజయాల పరంపరకు బ్రేక్ వేసింది. ఆస్ట్రేలియా మహిళలు సొంత గడ్డపై ఆదివారం టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో ఓడిపోయారు. ఈ విజయంతో రాబోయే టీ20, టెస్టు సిరీస్‌లో భారత మహిళలు ఎంతో ఆత్మ విశ్వాసంతో ఆడనున్నారు. అయితే మూడో వన్డే ద్వారా భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్‌ పేస్‌ బౌలర్‌ ఝుల‌న్ గోస్వామి చ‌రిత్ర సృష్టించింది.

కెరీర్‌లో 600 వికెట్లు:

కెరీర్‌లో 600 వికెట్లు:

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వ‌న్డేలో ఒకే ఓవ‌ర్లో రెండు వికెట్లు తీయ‌డం ద్వారా ఝుల‌న్ గోస్వామి క్రికెట్‌లో మొత్తం సాధించిన వికెట్ల సంఖ్య 600కు చేరింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌ను ఔట్ చేయ‌డం ద్వారా ఝుల‌న్ ఈ ఘ‌నత అందుకుంది. ఇప్ప‌టికే 192 వ‌న్డేల్లో 239 వికెట్ల‌తో ఈ ఫార్మాట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన రికార్డు ఆమె పేరిటే ఉంది. టెస్టుల్లో 41 వికెట్లు, టీ20ల్లో 56 వికెట్లు ఝుల‌న్ పడగొట్టింది. దీంతో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో ఆమె మొత్తం వికెట్ల సంఖ్య 336కు చేరింది. ఇక డొమెస్టిక్ క్రికెట్‌లో టీమిండియా వెటరన్ పేస్ బౌలర్ 264 వికెట్లు తీయ‌గా.. మొత్తం వికెట్ల సంఖ్య 600కు చేరింది.

2002లో అరంగ్రేటం:

2002లో అరంగ్రేటం:

ఝుల‌న్ గోస్వామి 2002వ సంవత్సరంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరఫున అరంగ్రేటం చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో గోస్వామి ప్రయాణం మొదలైంది. గోస్వామి చిన్నతనం నుంచే మగపిల్లలతో ఆడి.. ఆమెలోని పేస్‌ను మెరుగుపరుచుకుంది. కోల్‌కతాలోని వివేకానంద పార్క్‌లో ఆమె శిక్షణాకాలం మెరుగుపరచుకుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకుంది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు తిరగరాసింది. 2007లో 'ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు'ను అందుకుంది. 2010లో అర్జున అవార్డుతో పాటు 2012లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. ఇక గోస్వామి బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే.

రాణించిన గోస్వామి:

రాణించిన గోస్వామి:

మూడో వన్డే మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేశారు. ఆశ్లే గార్డ్‌నర్ (62 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67), బెత్ మూనీ (64 బంతుల్లో 6 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించగా.. తహిలా మెక్‌గ్రాత్ (32 బంతుల్లో 7 ఫోర్లతో 47), అలిసా హీలీ (47 బంతుల్లో 2 ఫోర్లతో 35) ఆకట్టుకున్నారు. భారత మహిళా బౌలర్లలో జూలన్ గోస్వామి (3/37), పూజా వస్త్రాకర్ (3/46) మూడేసి వికెట్లు తీయగా.. స్నేహ్ రాణాకు ఓ వికెట్ దక్కింది. ఆసీస్ జట్టులోని ఇద్దరు బ్యాటర్లు రనౌటయ్యారు.

షెఫాలీ హాఫ్ సెంచరీ:

షెఫాలీ హాఫ్ సెంచరీ:

అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 8 వికెట్లకు 266 రన్స్ చేసి మరో మూడు బంతులుండగానే విజయం సాధించింది. యస్తిక భాటియా (69 బంతుల్లో 9 ఫోర్లతో 64), షెఫాలీ వర్మ (91 బంతుల్లో 7 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీప్తి శర్మ (31), స్నేహ్ రాణా (30) భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆసీస్ బౌలర్లలో సుదెర్లాండ్ మూడు వికెట్లు తీయగా.. తహిలా మెక్‌గ్రాత్, సోఫియా మోలినక్స్, అష్లే గార్డ్‌నర్, స్టెల్లా కాంప్‌బెల్, నికోలా కారీ తలో వికెట్ తీశారు.

Story first published: Sunday, September 26, 2021, 19:03 [IST]
Other articles published on Sep 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+