Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs PAK: పాక్ పరువు పాయే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ అయితే భారత్ ప్లేయర్లపై ఆసీస్ ఫోకస్

మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో ఆస్ట్రేలియాలో రెండో టెస్టు ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ లంచ్ విరామానికి రెండు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (38), ఖవాజా (42) పరుగులు చేశారు. క్రీజులో లబుషేన్ (14), స్మిత్ (2) ఉన్నారు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్‌‌పై ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అయితే ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‌లోని బోర్డుపై భారత ప్లేయర్లు రాసి ఉన్న ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్ ఆల్‌రౌండర్లు అంటూ కొన్నిపేర్లును బోర్డుపై ఉన్నాయి. వారి గురించి ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ వివరిస్తున్నాడు. మొత్తం తొమ్మిది ప్లేయర్లు పేర్లు ఉంటే.. టీమిండియాకు చెందిన వారే ముగ్గురు ఉండటం విశేషం. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ పేర్లు ఉన్నాయి.

Australias focus on Indias players in the match against Pakistan

పాకిస్థాన్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. పాక్ ప్లేయర్లు గురించి చర్చించకుండా ఇతర దేశ ఆటగాళ్ల గురించి చర్చిస్తున్నారు ఏంటి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రత్యర్థిగా పాకిస్థాన్ అసలు మీకు కనిపించట్లేదా? అశ్విన్ పేరు తర్వాత ప్రశ్న గుర్తును ఎందుకు పెట్టారని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే అశ్విన్‌ను ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్నకు ఆస్ట్రేలియా దగ్గర ఇప్పటికీ సమాధానం లేదని, అందుకే ఆ గుర్తును ఉంచారని తమ అభిప్రాయాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం టీమిండియాతో దక్షిణాఫ్రికా‌లో ఉన్నాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా ఇవాళ సౌతాఫ్రికాతో భారత్ తొలి టెస్టు తలపడనుంది. కేప్‌టౌన్‌లో జనవరి 03 నుంచి రెండో టెస్టు జరగనుంది.

Story first published: Tuesday, December 26, 2023, 10:15 [IST]
Other articles published on Dec 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+