Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND Vs AUS: ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే.. మిచెల్ మార్ష్ తప్పించిన కెప్టెన్..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-2025లో చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా జరగనుంది. ఇప్పటికే సిరీస్ లో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
జనవరి 3న ఐదో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని భారత్ పట్టుదలగా ఉంది. అటు చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని కంగారులు చూస్తున్నారు. తాజాగా ఐదో టెస్ట్ కు ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 నుంచి ఫామ్‌లో లేని మిచెల్ మార్ష్ తప్పించనున్నట్లు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రకటించాడు.

మిచెల్ మార్ష్ స్థానంలో వెబ్‌స్టర్ తీసుకుంటామని వెల్లడించాడు. 33 ఏళ్ల మార్ష్ నాలుగు టెస్టుల్లో ఏడు ఇన్నింగ్స్‌లలో 73 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే కమిన్స్ అతన్ని తప్పించాలని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్ష్ ఇప్పటివరకు సిరీస్‌లో కేవలం 33 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. "మా జట్టులో ఒక మార్పు ఉంది. మిచ్ మార్ష్ స్థానంలో బ్యూ వెబ్‌స్టర్ తీసుకున్నాం. అతను తగినంత పరుగులు చేయలేదని అతని తెలుసు" అని కమిన్స్ చెప్పాడు.

Australia s final squad for the final Test omits Mitchell Marsh

ఈ సిరిస్ కు ముందు నవంబర్‌లో ఇండియా Aతో ఆడిన 31 ఏళ్ల వెబ్‌స్టర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 5247 పరుగులు, 148 వికెట్లు పడగొట్టాడు. ఇక భారత్ విషయానికొస్తే ఆకాశ్ దీప్ గాయం కారణంగా చివరి మ్యాచ్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణను తీసుకునే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాల్లో ఒకరు మాత్రమే తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. సిడ్నీ టెస్ట్ కు శుభ్ మాన్ గిల్ ను జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇక రోహిత్ శర్మ చివర టెస్ట్ ఆడడంపై కూడా సందిగ్ధత నెలకొంది. ఈ టెస్ట్ లో రోహిత్ శర్మ ఆడతాడా అని కోచ్ గంభీర్ ను ప్రశ్నించగా.. పిచ్ పరిశీలించి తుది జట్టు ప్రకటిస్తామని చెప్పాడు. రోహిత్ శర్మను విలేకరుల సమావేశానికి హాజరుకావడం లేదని అడిగినప్పుడు.. టాస్‌ సమయంలో ప్లేయింగ్ 11 ప్రకటిస్తాడని గంభీర్ చెప్పాడు. భారత్ ప్లెయింగ్ 11 లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w)/ధృవ్ జురెల్, రోహిత్ శర్మ(సి), నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్/ రవీంద్ర జడేజా, రాణా/ప్రసిధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఉండే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11: ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.

Story first published: Thursday, January 2, 2025, 15:30 [IST]
Other articles published on Jan 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+