Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: వరల్డ్ కప్‍కు ముందు ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ.. గాయపడిన వికెట్ కీపర్..

Australian wicket keeper Josh Inglis was injured before the T20 World Cup

టీ20 వరల్డ్ కప్ కు ముంది ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ గాయపడ్డాడు. బుధవారం సిడ్నీ గోల్ఫ్ కోర్స్‌లో జోష్ ఇంగ్లిస్‌కు గాయగం కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.వరల్డ్ కప్ లో భాగంగా 22న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో తలపడనుంది. ఇందుకు కోసం గురువారం ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించి బుధవారం ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు.

న్యూ సౌత్ వేల్స్ గోల్ఫ్ క్లబ్‌
దీంతో ఇంగ్లిస్ తో పాటు మరికొంత మంది ఆటగాళ్లు పెరౌస్‌లోని న్యూ సౌత్ వేల్స్ గోల్ఫ్ క్లబ్‌లో ఒక రౌండ్ గోల్ఫ్ ఆడడానికి వెళ్లారు. గోల్ఫ్ ఆడుతుండగా.. ఇంగ్లిస్ చేతిలో గోల్ఫ్ క్లబ్ విరిగిపోవడంతో చేతికి గాయమైందని తెలిసింది. అతను ఫెయిర్‌వేలో బంతిని కొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంగ్లిస్ క్లబ్ పగిలినట్లు తెలుస్తోంది. దీంతో అతని చేతి నుంచి రక్తం వచ్చినట్లు, అతని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

Australian wicket keeper Josh Inglis was injured before the T20 World Cup

మాథ్యూ వెడ్
అయితే ఆస్ట్రేలియాకు వికెట్ కీపర్ మాథ్యూ ఉన్నాడు. ఇతనికి స్పేర్ గా ఇంగ్లిస్ ఎంపిక చేశారు. కానీ ఇంగ్లిస్ కు గాయం కావడంతో భారమంతా మాథ్యూ వెడ్ మోయాలి. అయితే ఇంగ్లిస్ అయిన గాయం చిన్నదేనా లేక పెద్దదా అన్నది స్పష్టంగా తెలియరాలేదు. కాగా ఆస్ట్రేలియా ఇండియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఓడిపోయింది.ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీ అద్బుతంగా బౌలింగ్ చేశాడు.

Story first published: Wednesday, October 19, 2022, 12:55 [IST]
Other articles published on Oct 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+