న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

6,6,6,6,6,6లు వాటితో పాటు డబుల్ సెంచరీ బాదిన టీనేజర్ (వీడియో)

Australian teenager blasts six sixes in an over scoring a double century in an U19 one-day game

న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియా యువ క్రికెటర్ఆకాశమే హద్దుగా చెలరేగి ఒలివర్ డేవీస్ వన్డేలో రికార్డు సృష్టించాడు. అండర్-16, అండర్-19 జట్టులకు ప్రాతినిధ్యం వహిస్తోన్న డేవీస్.. 115 బంతుల్లో 207 పరుగులు చేశాడు. అండర్-19 నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆడిన ఈ యువ హిట్టర్ తొలుత 74 బంతుల్లో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఆ తర్వాత కేవలం 39 బంతుల్లోనే 200 పరుగుల మార్క్‌ని చేరుకున్నాడు.

డేవిస్ డబుల్ సెంచరీ అండర్ 19 ఛాంపియన్ షిప్‌ చరిత్రలో తొలి డబుల్ సెంచరీగా రికార్డు సాధించాడు. ఒకానొక దశలో ఒకే ఓవర్‌లో వరుసగా 6,6,6,6,6,6 బాది దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్నాడు. ఈ సిక్సుల గురించి మాట్లాడుతూ.. ముందు రెండు సిక్సులు పూర్తి అయిన తర్వాత మిగిలినవి కూడా సిక్సులే బాదాలనిపించిందని చెప్పాడు.

ఒకే ఓవర్‌లో వివిధ ఫార్మాట్లలో ఇప్పటి వరకు గ్యారీ సోబర్స్, రవిశాస్త్రి, గిబ్స్, యువరాజ్ సింగ్, విట్టీలీ, హజ్రతుల్లా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదగా.. తాజాగా ఈ జాబితాలో ఒలివర్ డేవీస్ చేరాడు. అంతేకాకుండా.. ఒకే ఇన్నింగ్స్‌లో 16 సిక్సర్లు బాదిన నాలుగో క్రికెటర్‌గానూ ఈ యువ హిట్టర్ నిలిచాడు. వన్డేల్లో ఇప్పటి వరకు ఒక మ్యాచ్‌లో రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, క్రిస్‌గేల్ మాత్రమే 16 సిక్సర్లు కొట్టారు.

ఒలివర్ డేవీస్ జోరుతో అతను ప్రాతినిథ్యం వహించిన న్యూ సౌత్ వేల్స్ మెట్రో జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 406 పరుగులు చేయగా.. ప్రత్యర్థి నార్త్‌రెన్ టెర్రిటరీ టీమ్ 238 పరుగులకే చేతులెత్తేసింది.

Story first published: Monday, December 3, 2018, 18:51 [IST]
Other articles published on Dec 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X