Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదేం చికెన్..: క్యాబ్ కుక్‌పై ఆసీస్ ఆటగాళ్లు అసంతృప్తి

హైదరాబాద్: ఎక్కువగా ఉడికిన చికెన్ ఆస్ట్రేలియా ప్లేయర్స్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందట. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన తొలి వన్డే ముగిసిన తర్వాత ఇరు జట్లు రెండో వన్డే కోసం కోల్‌కతాకు చేరుకున్నాయి.

ఇరు జట్ల మధ్య గురువారం రెండో వన్డే జరగనుంది. ప్రస్తుతం కోల్‌కతాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఆసీస్‌ జట్టు ఇండోర్‌ స్టేడియంలోనే ప్రాక్టీస్ చేసింది. ఉదయం సెషన్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ మాత్రమే ప్రాక్టీస్‌ చేయగా, బౌలర్లు తిరిగి వెళ్లిపోయారు.

మంచి గ్రిల్డ్ చికెన్ అందించలేదు

మంచి గ్రిల్డ్ చికెన్ అందించలేదు

ప్రాక్టీస్ అనంతరం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధికారులు కనీసం మంచి గ్రిల్డ్ చికెన్ కూడా ఆసీస్ ఆటగాళ్లకు అందించలేకపోయారట. ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్‌మెంట్ 73 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర చికెన్‌ను గ్రిల్డ్ చేయాలని చెప్పినప్పటికీ.. ఆటగాళ్లకు వడ్డించిన చేసిన చికెన్ మాత్రం అలా లేదని వాళ్లు ఫిర్యాదు చేశారు.

క్యాబ్ అధికారులపై సీరియస్

క్యాబ్ అధికారులపై సీరియస్

అంతేకాదు తాము అడిగిన విధంగా చికెన్ ఉడికించలేదని ఆసీస్ ఆటగాళ్లు క్యాబ్ అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. రంగంలోకి దిగిన క్యాబ్ అధికారులు ఆసీస్ ఆటగాళ్లను బుజ్జగించి కుక్‌కు సరిగా వండాలని వార్నింగ్ ఇచ్చి విషయం పెద్దది కాకుండా జాగ్రత్త పడ్డారు. వారికి మరోసారి ఇలా జరగదని నచ్చజెప్పారు. దీంతో బుధవారం వడ్డించిన చికెన్‌పై ఆసీస్ ప్లేయర్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో క్యాబ్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అన్ని రాష్ట్ర అసోసియేషన్లకు ఆటగాళ్ల మెనూను పంపిన బీసీసీఐ

అన్ని రాష్ట్ర అసోసియేషన్లకు ఆటగాళ్ల మెనూను పంపిన బీసీసీఐ

‘ముందే చెప్పినట్టు గ్రిల్డ్‌ చికెన్‌ను 73 డిగ్రీ సెంటిగ్రేడ్‌ వద్ద కాకుండా ఎక్కువ వేడి చేయడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి ఎలా వండి వడ్డించాలో ముందే చెప్పారు. దాన్ని అనుసరించక పోవడం వల్ల ఇలా జరిగింది. మరోసారి ఇలాంటి పొరపాటు చేయొద్దని వంటవారికి గట్టిగా చెప్పాం' అని క్యాబ్‌ తెలిపింది. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్‌కు వచ్చిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు సంబంధించి బీసీసీఐ ముందే అన్ని రాష్ట్ర అసోసియేషన్లకు ఆటగాళ్ల మెనూను పంపించేసింది. ఆసీస్ ఆటగాళ్ల మెనూలో కచ్చితంగా గ్రిల్డ్ చికెన్, పనీర్ ఉండేలా చూడాలని కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి.

రెండో వన్డేకి వరుణుడి ముప్పు

రెండో వన్డేకి వరుణుడి ముప్పు

ఇదిలా ఉంటే ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే రెండో వన్డేకి వరుణుడి ముప్పు పొంచి ఉంది. దీంతో గత రెండు రోజులుగా కుండపోతగా వర్షం కురువడంతో అప్పట్నించి ఈడెన్‌లో కవర్లను తొలగించలేదు. దీంతో కోహ్లీసేన స్టేడియానికి వెళ్లకుండా హోటల్ రూమ్‌లకే పరిమితమైంది. రాబోయే రెండు రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని కోల్‌కతా వాతావరణశాఖ డైరెక్టర్ గణేశ్ దాస్ తెలిపారు.

ఈస్ట్‌ జోన్ క్యురేటర్ ఆశిష్ బౌమిక్ ఇలా

ఈస్ట్‌ జోన్ క్యురేటర్ ఆశిష్ బౌమిక్ ఇలా

బుధవారం మధ్యాహ్నం కాసేపు ఎండకాసింది. అయినా సరే సిబ్బంది స్టేడియంలో కవర్లను మాత్రం తొలగించలేదు. 'మైదానాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి కనీసం రెండు గంటలు ఎండ ఉంటే సరిపోతుంది. మా దగ్గర అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. వాటితో తక్కువ సమయంలో స్టేడియాన్ని సిద్ధం చేస్తాం. మాకు మరో రెండు రోజుల సమయం ఉంది. కాబట్టి ఇబ్బందిలేదు. కవర్లను అందుకే తొలిగించలేదు' అని ఈస్ట్‌ జోన్ క్యురేటర్ ఆశిష్ బౌమిక్

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+