Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబైకి చేరుకున్న ఆస్ట్రేలియా: భారత జట్టు ఎంపిక నేడే

హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు సోమవారం భారత్‌కు చేరుకుంది. సిరిస్‌ ప్రారంభానికి ఇంకా పది రోజుల సమయం ఉండగానే స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ముంబైలో అడుగుపెట్టింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా జట్టు దుబాయిలోని ఐసీసీ క్రికెట్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది.

ఆస్ట్రేలియా జట్టు బుధవారం నుంచి ముంబైలో ప్రాక్టీస్ చేయనుంది. నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఫిబ్రవరి 23న పూణెలో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు 17-19 తేదీల్లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత్‌ ఏ జట్టుతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది.

నాలుగు టెస్టుల సిరిస్: ముంబైకి చేరుకున్న ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మాథ్యూ రెన్షా, షాన్ మార్ష్, పీటర్, మిచెల్ మార్ష్, మాథ్యూ వేడ్ (వికెట్కీపర్), స్టీవ్ ఓ మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్ ఉడ్, అష్టన్ అగర్, ఉస్మాన్ ఖవాజా, జాక్సన్ బర్డ్, మిచెల్ స్వీప్ సెన్, గ్లెన్ మాక్సెవెల్

ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత జట్టు ఎంపిక నేడే:
ఆస్ట్రేలియాతో ఈ నెల 23న జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టునే దాదాపుగా ఆస్ట్రేలియా సిరీస్‌కూ కొనసాగించే అవకాశముంది.

ఇంగ్లాండ్‌ సిరీస్ సందర్భంగా గాయపడ్డ పేసర్ షమీ పరిగణనలోకి తీసుకునే చాన్స్ మినహా భారీ మార్పులేమి ఉండకపోవచ్చు. అతను ఫిట్‌గా ఉంటే కచ్చితంగా జట్టులో ఉంటాడు. గాయంతో బంగ్లాదేశ్‌ టెస్టుకు దూరమైన అమిత్ మిశ్రా విషయంలోనూ స్పష్టత లేదు.

Australian team arrives for four-Test series against India


టెస్టు సిరీస్ షెడ్యూల్:
ఫస్ట్ టెస్టు: ఫిబ్రవరి 23-27 (పూణె)
సెంకడ్ టెస్టు: మార్చి 4-8 (బెంగళూరు)
మూడో టెస్టు: మార్చి 16-20 (రాంచీ)
నాలుగో టెస్టు: మార్చి 24-28 (ధర్మశాల)
Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+