
టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాల విజేత అయిన ఆస్ట్రేలియన్ స్విమ్మర్ ఎమ్మా మెక్‌కీన్.. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో తన సత్తా కొనసాగిస్తోంది. ప్రస్తుతం కామన్‌వెల్త్ గేమ్స్ ఎనిమిది ఈవెంట్ల కార్యక్రమంలో ఆమె పతకాల జోరు కొనసాగిస్తోంది. కామన్ వెల్త్ గేమ్స్.. 2024లో పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌కు తాను సిద్ధం కావడానికి ఉపయోగపడుతున్నట్లు చెప్పింది.
ఆల్-టైమ్‌లో అత్యంత విజయవంతమైన కామన్వెల్త్ గేమ్స్ అథ్లెట్‌గా మెక్‌కీన్ అవతరించింది. ఇక మహిళల 50మీటర్ల ఫ్రీస్టైల్‌లో ఆస్ట్రేలియా స్వీప్‌కు నాయకత్వం వహించి రికార్డు స్థాయిలో తన 12వ బంగారు పతకాన్ని సాధించింది. కామన్ వెల్త్ గేమ్స్‌లో అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన ఇయాన్ థోర్ప్, సూసీ ఓ నీల్, లీసెల్ జోన్స్ (10గోల్డ్ మెడల్స్) కంటే మరో రెండు గోల్డ్ మెడల్స్ సాధించి.. మెక్‌కీన్ చరిత్రకెక్కింది.
ఇకపోతే బర్మింగ్ హామ్‌లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్‌లో మిక్స్‌డ్ 4(100) ఫ్రీస్టైల్ మరియు మహిళల 4(100) ఫ్రీస్టైల్ రిలేలలో ఆమె తొలుత గోల్డ్ మెడల్స్ సాధించింది. తర్వాత 50మీ గోల్డ్ మెడల్ సాధించింది. తాజాగా 50మీటర్ల బటర్‌ఫ్లైలో కూడా విజయం సాధించి నాలుగో స్వర్ణం సాధించింది. తద్వారా కామన్వెల్త్ క్రీడల కెరీర్‌లో తన 17వ పతకాన్ని ఆమె ముద్దాడింది. ఇకపోతే కామన్ వెల్త్ గేమ్స్ చరిత్రలో.. అత్యధిక పతకాలు సాధించిన నాలుగో అథ్లెట్‌గా ఆమె కొనసాగుతుంది. ఆస్ట్రేలియన్ షూటర్ ఫిలిప్ ఆడమ్స్, ఇంగ్లీష్ షూటర్ మిక్ గాల్ట్, దక్షిణాఫ్రికా స్విమ్మర్ చాడ్ లే క్లోస్ 18పతకాలతో అత్యధిక పతకాల లిస్టులో తొలి స్థానంలో ఉన్నారు.
ఫ్రీస్టైల్‌లో 50మీటర్ల విజయం తర్వాత మెక్‌కీన్ మాట్లాడుతూ.. 'నేను సవాలును ప్రేమిస్తున్నాను. ఈ కామన్ వెల్త్ పార్టిసిపేషన్ నన్ను 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్ పోటీలకు సిద్ధం చేస్తోంది. ఇది నా బాడీకే కాదు నా మనసుకు కూడా శిక్షణనిస్తుంది. శారీరకంగా నేను చేస్తుంది చాలా కష్టమైన పని. కానీ నేను చేయగలననే నా మనసే నాకు శిక్షణనిస్తోంది. నేను పారిస్ ఒలింపిక్స్‌లో మరింత ధీటైన స్విమ్మర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల నేను మరింత ఆత్మవిశ్వాసాన్ని కూడబెట్టుకోవడానికి ఈ పోటీలు ఉపయోగపడుతున్నాయి' అని పేర్కొంది.