Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Nathan Lyon: టెస్ట్ క్రికెట్‌లో చెత్త రికార్డు న‌మెదు చేసిన ఆస్ట్రేలియా స్టార్ బౌల‌ర్

Australian spinner Nathan Lyon worst record in Test cricket.

రావ‌ల్పిండి: పాకిస్థాన్‌తో జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ నాథన్ లియాన్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. టెస్టు క్రికెట్‌లో 250 సిక్సులు స‌మ‌ర్పించుకున్న తొలి బౌల‌ర్‌గా నిలిచాడు. రెండో ​ఇన్నింగ్స్‌లో నాథ‌న్ లియాన్ వేసిన‌ 42వ ఓవర్‌లో పాకిస్థాన్ ఓపెన‌ర్ ఇమామ్-ఉల్-హక్ సిక్స‌ర్ బాద‌డం ద్వారా లియాన్ ఖాతాలో ఈ చెత్త రికార్డు చేరింది. ఈ జాబితాలో 194 సిక్సులు స‌మ‌ర్పించి శ్రీలంక మాజీ స్పిన్నర్‌ రంగనా హెరత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక కెరీర్లో ఇప్ప‌టివ‌ర‌కు 106 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన నాథ‌న్ లియాన్ 416 వికెట్లు తీశాడు. ఓ ఇన్నింగ్స్‌లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు 8/50 కాగా, టెస్ట్ మ్యాచ్‌లో 13/154గా ఉన్నాయి.

పాకిస్థాన్, ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 5 రోజుల పూర్తి ఆట సాధ్య‌మైన‌ప్పుటికీ ఇరు జ‌ట్ల‌ బ్యాట‌ర్లు పూర్తి అధిప‌త్యాన్ని ప్ర‌దర్శించడంతో టెస్ట్ మ్యాచ్‌లో ఏ ద‌శ‌లోనూ ఫ‌లితం వ‌చ్చేలా కనిపించ‌లేదు. పాకిస్థాన్ ఓపెన‌ర్ ఇమామ్ ఉల్ హ‌క్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచ‌రీల‌తో చెల‌రేగాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోక‌పోగా.. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నే లేదు. బౌల‌ర్ల‌కు ప‌ట్టు చిక్క‌ని ఈ ఫ‌స్ట్ మ్యాచ్‌లో బ్యాట‌ర్లు మాత్రం పండ‌గ చేసుకున్నారు. మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల న‌ష్టానికి 476 ప‌రుగుల భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది. పాక్ బ్యాట‌ర్లు అజార్ అలీ (185), ఇమామ్-ఉల్-హక్ (157) భారీ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. షఫీక్ 44, బాబ‌ర్ అజామ్ 36, రిజ్వాన్ 29 ప‌రుగులు చేశారు.

అటు ఆస్ట్రేలియా సైతం తొలి ఇన్నింగ్స్‌లో 459 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఉస్మాన్ ఖ‌వాజా (97), మార్న్ ల‌బుషేన్ (90) తృటిలో శ‌త‌కాలు చేజార్చుకున్నారు. స్టీవెన్ స్మిత్ (78), డేవిడ్ వార్న‌ర్ (68) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. మిగ‌తా వారిలో గ్రీన్ 48, అలెక్స్ క్యారీ 19, స్టాక్ 13, క‌మిన్స్ 8, హెడ్ 8, లియోన్ 3 ప‌రుగులు చేశారు. పాక్ బౌల‌ర్ల‌లో నౌమాన్ అలీ 6 వికెట్ల‌తో స‌త్తా చాటాడు. షాహీమ్ ఆఫ్రీదీ 2, నసీమ్ షా, స‌జీద్ ఖాన్ త‌లో వికెట్ తీశారు. అనంత‌రం చివ‌రి రోజు 17 ప‌రుగుల అధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్టపోకుండా 252 ప‌రుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Story first published: Tuesday, March 8, 2022, 22:38 [IST]
Other articles published on Mar 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+