For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌ 2020 వేలం.. ఆస్ట్రేలియా ఆటగాళ్లపై రూ. 58.25 కోట్లు!!

Australian Players Dominated in IPL Auction 2020: Pat Cummins, Glenn Maxwell headline big IPL pay day

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-13వ సీజన్‌ కోసం గురువారం కోల్‌కతాలో జరిగిన వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల పంట పండింది. అన్ని ఫ్రాంచైజీలు ఆసీస్ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు. ఈ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు వీదేశీ ఆటగాళ్లపై రూ.140.30 కోట్లు ఖర్చు చేయగా.. ఆసీస్ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించాయి. 13 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లపై రూ.58.25 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు ఆసీస్ ఆటగాళ్లకు ఎంత డిమాండ్ ఉందో.

 విదేశీ ప్లేయర్‌గా రికార్డు:

విదేశీ ప్లేయర్‌గా రికార్డు:

ఇటీవలికాలంలో అద్భుతంగా రాణిస్తున్న స్టార్ పేసర్ ప్యాట్‌ కమిన్స్‌ను రూ. 15.50 కోట్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ దక్కించుకుంది. లీగ్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఏ విదేశీ ఆటగాడిపై పెట్టనంత భారీ మొత్తాన్ని కేకేఆర్‌ వెచ్చించింది. ఇంతకుముందు బెన్‌ స్టోక్స్‌ 2017లో రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్స్‌ రూ. 14.5 కోట్లకు కొనుగోలు చేసింది.

మ్యాక్సికి తగ్గట్లే:

మ్యాక్సికి తగ్గట్లే:

ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ రూ.10.75 కోట్లకు కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ సొంతం చేసుకుంది. ఇతని కనీస ధర రూ. 2 కోట్లు. మ్యాక్సీ కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీపడగా.. చివరకు పంజాబ్ దక్కించుకుంది. ఆసీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్‌ ఫించ్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కొనుగోలు చేసింది. ఫించ్‌ కనీస ధర 1 కోటి ఉండగా.. రూ. 4.40 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఫించ్ కోసం కోల్‌కతా, బెంగళూరు ఫ్రాంఛైజీల మధ్య హోరాహోరీ నడిచింది.

మార్కస్‌కు అనూహ్య ధర:

మార్కస్‌కు అనూహ్య ధర:

ఆస్ట్రేలియా పేసర్ నాథన్‌ కౌల్టర్‌నీల్‌ను ముంబై ఇండియన్స్‌ రూ. 8 కోట్లకు దక్కించుకుంది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. మార్కస్‌ స్టోయినిస్‌ను మొదట్లో ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. కానీ.. చివరి రౌండ్‌లో ఢిల్లీ రూ.4. 80 కోట్లకు సొంతం చేసుకుంది. మిగతా ఆటగాళ్లు కేన్‌ రిచర్డ్‌సన్‌ (ఆర్‌సీబీ), అలెక్స్‌ క్యారీ (ఢిల్లీ), జోష్‌ హాజల్‌వుడ్‌ (చెన్నై), మిచెల్‌ మార్ష్‌ (సన్‌రైజర్స్‌), క్రిస్‌ లిన్‌ ( ముంబై), అండ్రూ టై ( రాజస్థాన్‌), టామ్‌ బాంటన్‌ ( కేకేఆర్‌), జూయిస్‌ ఫిలిప్‌ (ఆర్‌సీబీ), క్రిస్‌ గ్రీన్‌ (కేకేఆర్‌)లకు కూడా మంచి ధరే పలికింది.

 మోర్గాన్‌కు రూ. 5.50 కోట్లు:

మోర్గాన్‌కు రూ. 5.50 కోట్లు:

ఆసీస్ తర్వాత రూ. 17.75 కోట్లతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు, రూ. 17.25 కోట్లతో కరేబియన్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ను రూ. 5.50 కోట్లకు కేకేఆర్‌ దక్కించుకుంది. సామ్ కరణ్‌ను రూ. 5.50 కోట్లకు చైన్నె, టామ్‌ కరణ్‌ను రూ. 1 కోటితో రాజస్తాన్‌ దక్కించుకున్నాయి. క్రిస్‌ జోర్డాన్‌ (పంజాబ్‌), జాసన్‌ రాయ్‌ (ఢిల్లీ), క్రిస్‌ వోక్స్ (ఢిల్లీ)లు కూడా భారీ ధర పలికారు.

కనీస ధరకే స్టేయిన్‌, మిల్లర్‌:

కనీస ధరకే స్టేయిన్‌, మిల్లర్‌:

విండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ను రూ. 8.50 కోట్లతో పంజాబ్‌, షిమ్రన్‌ హెట్‌మైర్‌ను రూ. 7.75 కోట్లతో ఢిల్లీ సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ను మాత్రమే రూ.10 కోట్లకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. స్టార్ ఆటగాళ్లు డేల్‌ స్టేయిన్‌, డేవిడ్‌ మిల్లర్‌లు తమ తమ కనీస ధరకే అమ్ముడుపోయారు.

Story first published: Friday, December 20, 2019, 17:49 [IST]
Other articles published on Dec 20, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+