Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గిల్ కాదు.. అతనే భారత భవిష్యత్ సూపర్ స్టార్: స్టీవ్ స్మిత్

టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మెరుపులు మరికొన్నాళ్లు మాత్రమే చూడగలం. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై పలికిన వీరద్దరు త్వరలో మిగిలిన ఫార్మాట్లకు కూడా గుడ్‌బై పలికే అవకాశం ఉంది. వచ్చే ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ అనంతర వారి భవితవ్యంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

అయితే కోహ్లి, రోహిత్ తర్వాత భారత సూపర్ స్టార్ క్రికెటర్ ఎవరవుతారనే చర్చ మొదలైంది. అన్ని ఫార్మాట్లు ఆడే శుభ్‌మన్ గిల్ ఫ్యూచర్ స్టార్ అవుతారని మాజీలతో సహా విశ్లేషకులు తొలుత భావించారు. కానీ నిలకడలేమి ప్రదర్శనతో గిల్ అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు. మరోవైపు యశస్వీ జైస్వాల్ పేరు భవిష్యత్ స్టార్‌గానే గట్టిగా వినిపిస్తోంది. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా.. జైస్వాల్‌పై పలుమార్లు ప్రశంసల జల్లు కురిపించాడు.

Australian Players Back Yashasvi Jaiswal as India s Next Cricket Superstar

కాగా, భారత భవిష్యత్ స్టార్ శుభ్‌మన్ గిల్ X యశస్వీ జైస్వాల్ డిబేట్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ తమిళ్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఎక్కువ మంది ఆసీస్ క్రికెటర్లు యశస్వీ‌నే భారత క్రికెట్ సూపర్ స్టార్ అవుతాడని అన్నారు. ట్రావిస్ హెడ్ మాత్రం గిల్‌ సూపర్ స్టార్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. స్పిన్‌ను గిల్ సమర్థవంతంగా ఎదుర్కొంటాడని, ఇప్పటికే పలు గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడని పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా క్రికెటర్ల అభిప్రాయాలు:
స్టీవ్ స్మిత్- యశస్వీ జైస్వాల్
మిచెల్ స్టార్క్- యశస్వీ జైస్వాల్
కామెరూన్ గ్రీన్- శుభ్‌మన్ గిల్
అలెక్స్ క్యారీ- యశస్వీ జైస్వాల్
హేజిల్‌వుడ్- యశస్వీ జైస్వాల్
నాథన్ లైయన్- యశస్వీ జైస్వాల్
లబుషేన్- యశస్వీ జైస్వాల్ & శుభ్‌మన్ గిల్
ట్రావిస్ హెడ్- శుభ్‌మన్ గిల్.

Story first published: Monday, September 16, 2024, 10:59 [IST]
Other articles published on Sep 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+