యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ పై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ ప్రశంసలు కురించారు. భవిష్యత్ లో జైస్వాల్ కు రికార్డులు సృష్టించే సత్తా ఉందని పేర్కొన్నాడు. భారత ఓపెనర్ 40 టెస్ట్ సెంచరీలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. భారత క్రికెట్‌లోని ప్రకాశవంతమైన యువ ప్రతిభావంతుల్లో ఒకరిగా జయస్వాల్ ఉన్నాడని ప్రశంసించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై అద్భుతమైన ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని గుర్తు చేశాడు.
"అతను (జైస్వాల్) బహుశా 40 కంటే ఎక్కువ టెస్టు సెంచరీలు సాధించి, కొన్ని విభిన్నమైన రికార్డులు సృష్టించే వ్యక్తి. విభిన్న పరిస్థితులకు తగ్గట్టు అతను గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు" అని 'ది గ్రేడ్ క్రికెటర్' పోడ్‌కాస్ట్‌లో మాక్స్‌వెల్ చెప్పాడు. ఆస్ట్రేలియాలో తన మొదటి టెస్ట్ ఆడుతూ జైస్వాల్ రెండవ ఇన్నింగ్స్‌లో 161 పరుగులతో చెరగని ముద్రవేశాడని వివరించాడు. జైస్వాల్ 15 టెస్టుల్లో నాల్గో సెంచరీ సాధించాడు. జైస్వాల్ ఇప్పటి వరకు 58.07 సగటుతో 1,568 పరుగులు సాధించాడు. పెర్త్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ యశస్వి బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

"అతను చాలా షాట్లు ఆడాడు, అవి హైలైట్ ప్యాకేజీలలో ఉంటాయి. కానీ మధ్యలో అతను చేసిన అంశాలు. అతను వదిలిపెట్టిన బంతులు. అతను వెనుకకు వచ్చిన బంతులు. అతని ఫుట్‌వర్క్ చాలా స్ఫుటమైనది" అని మ్యాక్స్ వెల్ చెప్పాడు ఆస్ట్రేలియాతో జరగబోయే తదుపరి టెస్ట్ ల్లో అతన్ని ఆపడానికి ఒక మార్గాన్ని కనుగొనలేకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని పేర్కొన్నాడు. తాత్కాలికంగా కెప్టెన్ గా వ్యవహరించిన ఫాస్ట్ బౌలర్ బుమ్రా గురించి మ్యాక్సీ మాట్లాడారు.
బుమ్రా ఆల్ టైమ్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా ఎదగబోతున్నట్లు చెప్పాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడంతో ఆస్ట్రేలియాలో భారత్‌కు అత్యంత ఆధిపత్య విజయాన్ని అందించిన జస్ప్రీత్ బుమ్రా, అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా తన హోదాను బలోపేతం చేసుకున్నాడని వివరించాడు.
బుమ్రా మొదటి టెస్ట్ లో 8 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా ఆల్ టైమ్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా ఎదుగుతాడాని తాను ముందే చెప్పినట్లు గుర్తు చేశాడు.