Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాల్‌గర్ల్ పట్ల సోంగా ఔదార్యం: ప్రశంసలు(వీడియో)

సిడ్నీ: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టెన్నిస్‌ కోర్టులో ఆటగాళ్లకు బాల్ గర్ల్స్, బాల్ బాయ్స్ కూడా తమ సేవలను అందిస్తుంటారనేది తెలిసిన విషయమే. సాధారణంగా ఆటగాళ్లు తమ ఆటలో నిమగ్నమై ఉంటారే తప్పా.. వారిని అంత శ్రద్ధగా పట్టించుకునే అవకాశం ఉండదు.

అయితే, ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం ఓమెర్ జాసికాతో మూడో సెట్ సందర్భంగా బాల్ గర్ల్ వద్దకు కొన్ని టెన్నిస్ బంతులను తీసుకున్నాడు 9వ సీడెడ్ ఫ్రెంచ్ ఆటగాడు విల్ఫ్రెడ్ జో సోంగా. తర్వాత ఆ బంతులను బాల్ గర్ల్‌కు ఇవ్వబోతుండగా అమ్మాయిలో ఎటువంటి స్పందనా రాలేదు.

వణుకుతున్న చేతులతో ఆమె ఒక బొమ్మలా అలానే నిల్చుని ఉండిపోయింది. దీంతో సోంగానే బాల్ గర్ల్ వద్దకు వెళ్లి ఏమైంది అంటూ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. దీనికి సమాధానంగా బాల్ గర్ల్ తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో సోంగా ఓదార్చాడు. ఆ తర్వాత మ్యాచ్ నిర్వాహకులతో మాట్లాడి ఆ బాలికను అక్కడ్నుంచి బయటికి పంపించి వేశాడు.

కాగా, ఈ పరిణామం మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీంతో సోంగాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతను నిజంగా ఒక జెంటిల్మన్ వ్యవహరించాడని టెన్నిస్ అభిమానులు కొనియాడారు.

దీనిపై సోంగా స్పందిస్తూ.. ఆ అమ్మాయికి తాను చేసిన సాయం ఏమీ లేదంటూ తన ఉన్నతిని చాటుకున్నాడు. కేవలం స్టేడియం బయటకు పంపడం వరకూ మాత్రమే ఆమెకు సాయపడ్డాడని తెలిపాడు. ఆమె ఆరోగ్యం సర్దుకుంటుందని ఆశిస్తున్నానని తెలిపాడు. కాగా, ఆస్ట్రేలియాకు చెందిన ఓమర్ జసికాపై 7-5, 6-1, 6-4 తేడాతో రెండో రౌండ్‌లో గెలిచిన సోంగా మూడో రౌండ్లో అడుగుపెట్టాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+