Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హోటల్ సిబ్బందికి కరోనా.. క్వారంటైన్‌లోకి 600 మంది ఆటగాళ్లు!!

Australian Open 2021: 600 players and staff go into isolation after hotel worker tests positive for Coronavirus

మెల్‌బోర్న్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టినా.. ప్రతిరోజు ఎన్నోకొన్ని కేసులు మాత్రం నమోదవుతూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మహమ్మారి మాత్రం వీడడం లేదు. మొదటి నుంచి ఇప్పటిదాకా కఠినమైన కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తున్న దేశం ఆస్ట్రేలియా. ఒక్క కరోనా కేసు నమోదైనా సరే పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది అక్కడి ప్రభుత్వం. అయితే బుధవారం నమోదైన ఒక్క కరోనా కేసు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు సిద్ధమవుతున్న ఆటగాళ్లను ఉలిక్కిపడేలా చేసింది.

హోటల్ సిబ్బందికి కరోనా:

హోటల్ సిబ్బందికి కరోనా:

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్లేయర్స్ బస చేస్తున్న గ్రాండ్ హయత్ హోటల్‌లో బుధవారం ఓ కార్మికుడికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆ హోటల్‌లో ఉన్న మొత్తం 600 మంది క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇందులో ప్లేయర్స్, అధికారులు మరియు సహాయక సిబ్బంది ఉన్నారు. టోర్నీ ప్రారంభం కావడానికి నాలుగు రోజుల ముందు ఇలా జరగడం ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులలో ఆందోళన కలిగిస్తోంది. విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ హోటల్ సిబ్బందికి కరోనా సోకిందని, రాష్ట్రంలో 28 రోజుల్లో ఇదే తొలి కేసు అని చెప్పారు.

ఆరు టోర్నీల మ్యాచ్‌లు వాయిదా:

ఆరు టోర్నీల మ్యాచ్‌లు వాయిదా:

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి సన్నాహకంగా మెల్‌బోర్న్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం ఆరు టోర్నీలు జరుగుతున్నాయి. ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్‌లో ఫైర్ డిపార్మెంట్‌కు చెందిన సిబ్బందికి వైరస్ సోకడంతో.. ఆ హోటల్‌లో బస చేసిన ప్లేయర్స్ గురువారం ఈ టోర్నీలలో ఆడే మ్యాచ్‌లన్నీ వాయిదా వేశారు. మళ్లీ వారందరికీ పరీక్షలు చేసి.. నెగెటివ్‌ అని తేలాకే బయటికి వెళ్లేందుకు అనుమతిస్తారు.

క్వారంటైన్‌లోకి 600 మంది:

క్వారంటైన్‌లోకి 600 మంది:

'గ్రాండ్ హయత్ హోటల్‌లో పనిచేస్తున్న ఫైర్ డిపార్మెంట్‌కు చెందిన సిబ్బందికి జనవరి 29న జరిపిన పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. అనంతరం ఫిబ్రవరి 3న పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో హోటల్‌లో బస చేస్తున్న 500 నుంచి 600 మందిని క్వారంటైన్‌లోకి పంపారు. వారందరికీ పరీక్షలు చేసి.. నెగెటివ్‌ అని తేలాకే బయటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. సోమవారం ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌పై ఈ ప్రభావం ఏమీ ఉండదు' అని డేనియల్ ఆండ్రూస్ తెలిపారు.

భారత్ నుంచి సుమిత్‌ నగాల్:

భారత్ నుంచి సుమిత్‌ నగాల్:

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భారత్ నుంచి సుమిత్‌ నగాల్‌, రామ్‌కుమార్, ముకుంద్, బోపన్న, దివిజ్‌ శరణ్‌‌ లాంటి భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడుతున్నారు. అందరూ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. పురుషుల సింగిల్స్‌లో డొమినిక్ థీమ్‌ (ఆస్ట్రియా), మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్ (యుఎస్‌) టైటిళ్లు గెలుస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

టీమిండియాతో సిరీస్ అయితే ఇలానే చేస్తారా?.. క్రికెట్ ఆస్ట్రేలియాపై వాన్ ఫైర్!!

Story first published: Thursday, February 4, 2021, 10:05 [IST]
Other articles published on Feb 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+