For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పరువు నష్టం కేసు: మీడియాకు చుక్కెదురు.. గేల్‌కు అనుకూలంగా తీర్పు

Australian Newspapers Lose Chris Gayle Masseuse Defamation Appeal || Oneindia Telugu
Australian newspapers lose Chris Gayle masseuse defamation appeal

వెస్టిండీస్ స్టార్ క్రికెటర్, విధ్వంసక ఓపెనర్ క్రిస్‌ గేల్‌కు మరోసారి కోర్టులో అనూకూలంగా తీర్పు వచ్చింది. పరువు నష్టం కేసులో క్రిస్‌ గేల్‌కు అనుకూలంగా వచ్చిన తీర్పును సవాల్‌ చేసిన ఆస్ట్రేలియాకు చెందిన ఫెయిర్‌ ఫ్యాక్స్‌ మీడియాకు కోర్టులో చుక్కెదురైంది. క్రిస్‌ గేల్‌కు 3 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు (సుమారు రూ. కోటీ 45 లక్షలు) పరిహారంగా చెల్లించాల్సిందేనని న్యూసౌత్‌వేల్స్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే పరిహారాన్ని మరింత పెంచాలంటూ గేల్‌ చేసిన మరో అప్పీల్‌ను మాత్రం కోర్టు తిరస్కరించింది.

మహిళ పట్ల అసభ్యంగా:

మహిళ పట్ల అసభ్యంగా:

2015 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భాగంగా సిడ్నీలో మ్యాచ్ ఆడేందుకు విండీస్ జట్టుతో వచ్చిన గేల్.. డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి మసాజ్‌ చేయడానికి వచ్చిన మహిళ పట్ల మర్మాంగాన్ని చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని ఫెయిర్‌ఫాక్స్‌ కథనం ప్రచురించింది. 2016లో కూడా వరుస కథనాలను ప్రచురించింది. దీనిపై 2016లో గేల్‌‌ న్యాయ స్థానాన్ని ఆశ్రయించాడు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ వరుస కథనాలను ప్రచురించిందంటూ ఆరోపించాడు.

గేల్‌‌కు అనుకూలంగా తీర్పు:

గేల్‌‌కు అనుకూలంగా తీర్పు:

న్యూ సౌత్‌వేల్స్ కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. మహిళా మసాజర్ పట్ల గేల్ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ కేసును కొట్టేసింది. దీంతో గేల్‌‌కు అనుకూలంగా తీర్పు వెలుబడింది. కేసును కొట్టివేసే సమయంలో గేల్‌‌కు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే పరిహారం సరిపోలేదంటూ గేల్‌‌, విచారణ సరిగ్గా జరగలేదని ఫెయిర్‌ఫాక్స్‌ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన కోర్టు వీళ్ల అప్పీల్‌‌ను తిరస్కరించింది.

క్రికెట్‌కి గుడ్ బై:

క్రికెట్‌కి గుడ్ బై:

గేల్ త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పనున్నాడు. టీమిండియాతో జరిగే టెస్ట్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకోనున్నట్లు గేల్ ప్రకటించాడు. ఐసీసీ ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కి గుడ్ బై చెబుతానని ప్రకటించిన గేల్.. భారత్ సిరీస్ అనంతరం తప్పుకుంటారని తెలిపాడు. జమైకాలోకి కింగ్స్‌స్టన్‌లో పుట్టిన గేల్ 1999లో అంతర్జాతీయ జట్టులోకి ఆరంగేట్రం చేశాడు. విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో గేల్‌ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

Story first published: Wednesday, July 17, 2019, 10:46 [IST]
Other articles published on Jul 17, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+