Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ షో, సాటిలేరెవ్వరూ: కోహ్లీపై ఆసీస్ మీడియా

మొహాలీ/మెల్బోర్న్: మోహాలీలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాకు విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీపై ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక, ఇటు జాతీయ మీడియాతో పాటు, అటు ఆస్ట్రేలియన్‌ మీడియా తోపాటు అంతర్జాతీయ మీడియా సైతం విరాట్‌ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాయి.

ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ చేజారిపోయిందన్న దశలో నిలకడగా ఆడి జట్టుకు విజయాన్ని అందించిన కోహ్లీ బ్యాటింగ్‌ తీరును చూసిన ఆస్ట్రేలియన్‌ మీడియా కోహ్లీని అభినందించకుండా ఉండలేకపోయింది.

కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆకాశానికెత్తేసింది. కోహ్లీ ఇన్నింగ్స్‌ను 'విరాట్‌ షో', 'విరాట్‌ లాంటి బ్యాట్స్‌మెన్‌ లేడు' 'విరాట్‌ ఒక్కడి విజయం' అంటూ తమదైన శైలిలో ప్రశంసలతో ముంచెత్తాయి.

Australian media praises World T20's 'Virat show'

మరోవైపు కోహ్లీ ఆట తీరును చూసిన ఆ దేశ మాజీ క్రికెటర్లు సైతం పొగడ్తల వర్షం కురిపించారు. మాజీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌, మైకెల్‌ క్లార్క్‌ వంటి ప్రముఖులు కోహ్లి ఇన్నింగ్స్‌ అద్భుతమని ప్రశంసించారు.

అత్యుత్తమ క్రికెటర్ చేతిలో ఓడిపోయాం: బాధలేదన్న గ్లేన్ మాక్స్‌వెల్

ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ గా ఎదిగిన విరాట్ కోహ్లీ చేతిలో తాము ఓడిపోయామని, అందుకు బాధపడటం లేదని ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లేన్ మాక్స్ వెల్ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఓ విభిన్న స్థాయి ఇన్నింగ్స్ ఆడాడని, అతని ప్రతిభను మాటల్లో వర్ణించలేనని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా జట్టు నంబర్ వన్ క్రికెటింగ్ జీనియస్ చేతిలో ఓటమి పాలైందని, ఇది వన్ మ్యాన్ షో అని ప్రశంసించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+