Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఆస్ట్రేలియా స్టార్.. వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై!

 Australian legend announces ODI retirement

ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ బ్యాటర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ ఉన్న ఈ ఏడాది తాము కూడా వరల్డ్ కప్ ఆడే జట్టులో భాగమవ్వాలని అందరూ ప్రయత్నిస్తుంటే తాను మాత్రం వన్డే ఫార్మాట్‌లో ఇక ఆడబోనని ప్రకటించాడు. తను వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. అతనే సీనియర్ బ్యాటర్ షాన్ మార్ష్. వన్డేలతోపాటు తాను ఇకపై ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడబోనని తేల్చి చెప్పాడీ ఎడం చేతి వాటం బ్యాటర్.

దేశవాళీల్లో లెజెండ్..

దేశవాళీల్లో లెజెండ్..

తన కెరీర్‌లో 22 ఏళ్ల పాటు వెస్టర్న్ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన మార్ష్.. ఆ జట్టుకు ఎన్నో మరచిపోలేని విజయాలు అందించాడు. 17 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన అతను.. గతేడాది ప్రతిష్ఠాత్మక షెఫీల్డ్ షీల్డ్ కాంపిటీషన్ కూడా నెగ్గాడు. తన సోదరుడు మిచెల్ మార్ష్ లేకపోవడంతో వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టుకు ఫైనల్‌లో కెప్టెన్సీ చేసిన షాన్ మార్ష్ ఆ జట్టును గెలిపించాడు. ఇక వన్డేల విషయానికొస్తే.. ఈ 39 ఏళ్ల క్రికెటర్ తన కెరీర్‌లో మొత్తం 177 లిస్ట్-ఎ మ్యాచులు ఆడాడు. వీటిలో 44.45 సగటుతో 7158 పరుగులు చేశాడు.

టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ..

టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ..

వెస్టర్న్ ఆస్ట్రేలియా తరఫున అద్భుతమైన రికార్డులు కూడా నెలకొల్పిన అతను.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో లెజెండ్‌గా ఎదిగాడు. అంతర్జాతీయ స్థాయిలో కూడా చక్కగా రాణించిన అతను.. మొత్తం 38 టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచుల్లో 34.31 సగటుతో 2265 పరుగులు చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 2011 సెప్టెంబరు 8న టెస్టు అరంగేట్రం చేసిన ఈ క్రికెటర్.. 2019లో ఆస్ట్రేలియా ఎండాకాలంలో భారత్‌పై తన చివరి మ్యాచ్ ఆడాడు. అంతేకాదు, తన టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ బాదిన అతికొద్ది మంది ఆటగాళ్లలో షాన్ మార్ష్ కూడా ఒకడు.

వన్డేల్లో కూడా మంచి రికార్డే..

వన్డేల్లో కూడా మంచి రికార్డే..

వన్డే ఫార్మాట్‌లో కూడా ఎన్నో రికార్డులు నెలకొల్పిన అతను ఆస్ట్రేలియా తరఫున 73 వన్డేలు ఆడాడు. వీటిలో 40.77 సగటుతో 2773 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో ఏడు సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో అతను కూడా ఆడేందుకు పోటీలో ఉన్నాడు. కానీ అతనికి అవకాశం దక్కడం కష్టంగా ఉంది. దీనికి అతని వయసు కూడా ఒక కారణమే. ఈ క్రమంలోనే తను వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. వన్డేలతోపాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు కూడా రిటైర్‌మెంట్ ప్రకటించాడు.

Story first published: Friday, March 10, 2023, 20:55 [IST]
Other articles published on Mar 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+