హైదరాబాద్: కోహ్లీసేన చేతిలో వన్డే సిరిస్ ఓటమిని తట్టుకోలేని ఓ ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ కెప్టెన్ కోహ్లీపై తన అక్కసు వెల్లగక్కాడు. ఆసీస్ ఓడిన ప్రతిసారీ ప్రత్యర్ధి దేశాలకు చెందిన ఆటగాళ్లపై విమర్శలు చేయడం ఆసీస్ మీడియాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటే.
తాజాగా కోహ్లీని వెక్కిరింతకు గురిచేస్తూ డెన్నిస్ ఫ్రీడ్‌మాన్ అనే జర్నలిస్టు తన ట్విట్టర్‌లో ఓ ఫొటోను షేర్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో భారత అభిమానులు ఆ జర్నలిస్టుని ట్విట్టర్‌లో ట్రోల్ చేస్తున్నారు.
కోహ్లీ షాకింగ్ హావభావాలున్న ఓ ఫోటోకు క్యాప్షన్‌గా 'పాక్ బౌలర్ అమిర్ బంతి ఎదుర్కొని అవుటైన కోహ్లీ' అంటూ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు భారత అభిమానులు 'ప్రతి వరల్డ్‌కప్‌లో పాక్ పరిస్థితి ఇదేనని, భారత్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఆసీస్ బౌలర్ల హావభావాలని' సమాధానమిచ్చాడు.