ఆట రాని వారికి అంతంత జీతాలెందుకు?: ఆసీస్ క్రికెటర్లపై ఫ్యాన్స్
హైదరాబాద్: స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ప్రదర్శనపై ఆ దేశ క్రికెట్ అభిమానులు ఎంత మాత్రం సంతృప్తిగా లేరు. భారత్ చేతిలో ఐదు వన్డేల సిరిస్‌ను మరో రెండు వన్డేలు మిగిలుండగానే చేజార్చుకోవడంతో వాళ్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా జట్టు వరుస ఓటములను అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
దీంతో స్మిత్ సేనపై బహిరంగంగానే విమర్శలు కురిపిస్తున్నారు. అసలు ఆట రాని వాళ్లకి అంతంత జీతాలెందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కామెంట్లను ఆసీస్ న్యూప్ పేపర్లు డైలీ టెలిగ్రాఫ్, ద ఆస్ట్రేలియన్ వెబ్ సైట్స్ కామెంట్స్ సెక్షన్‌లో పోస్టు చేస్తున్నారు. జీతాల విషయంలో ఇటీవలే ఆ దేశ క్రికెట్ బోర్డుతో ఆస్ట్రేలియా క్రికెటర్లు కొట్లాడిన సంగతి తెలిసిందే.

యాషెస్ సిరీస్ దూరంగా ఉంటామని బెదిరించిన క్రికెటర్లు
కొత్త కాంట్రాక్టుపై సంతకాలు పెట్టడానికి నిరాకరించడంతో పాటు... జీతాల విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా దిగి రాకపోతే భారత పర్యటనకు వెళ్లబోమని, యాషెస్ సిరీస్ దూరంగా ఉంటామని క్రికెటర్లు బెదిరించారు. దీంతో చివరకు క్రికెట్ ఆస్ట్రేలియా దిగొచ్చి ప్లేయర్స్ డిమాండ్స్‌కు తలొగ్గింది.

ఆట మాత్రం ఆడరా?
ఈ జీతాల విషయాన్ని ఆసీస్ క్రికెట్ అభిమానులు తెరపైకి తీసుకొచ్చారు. జీతాల కోసం సమ్మెకు దిగేందుకైనా వెనుకాడరు గానీ, ఆట మాత్రం ఆడరా? అని నిలదీస్తున్నారు. దీనిపై డైలీ టెలిగ్రాఫ్, ద ఆస్ట్రేలియన్ లాంటి పత్రికల్లో ఫ్యాన్స్ తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు.

అంతంత జీతాలు ఎందుకు చెల్లిస్తున్నట్టో
'వాళ్లకు ఏ పని చేయడానికి అంతంత జీతాలు చెల్లిస్తున్నారో ఆటగాళ్లు ఆ పని చేయడం లేదు. ఇక మరోసారి పాత రూల్స్‌ను ప్రవేశపెట్టాల్సిందే. వాళ్లు భార్యలు, భాగస్వాములు లేకుండా పంపించండి. అప్పుడైనా రన్స్, వికెట్స్ ఎక్కువ తీస్తారేమో. వాళ్లు చేసిన రన్స్, తీసిన వికెట్స్‌ను బట్టే తర్వాతిసారి వాళ్లకు జీతాలు పెంచండి' అని ఓ అభిమాని కామెంట్ చేశాడు.

ప్రదర్శనను బట్టి కాంట్రాక్టులను ఇవ్వండి
'వాళ్లకు ఉత్త పుణ్యానికే కోట్లు చెల్లించే కంటే ప్రదర్శనను బట్టి ఆటగాళ్లకు కాంట్రాక్టులను ఇవ్వండి' అంటూ మరో అభిమాని అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications