
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవెన్ స్మిత్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 55 నిముషాలపాటు లిఫ్ట్‌లోనే గడపాల్సి వచ్చింది. దీంతో లిఫ్ట్‌లో స్మిత్ లబోదిబోమన్నాడు. అప్పటికీ తన సహచర ఆటగాడు మార్నస్ లబుషేన్.. స్మిత్‌ను బయటికి తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అసలు ఏం జరిగిందటే.. యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో మూడో టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా అక్కడే ఒక హోటల్‌లో బస చేస్తోంది.
దీంతో కింది నుంచి తన రూమ్‌కు వెళ్లేందుకు స్మిత్ లిఫ్ట్ ఎక్కాడు. అయితే ఉన్నట్టుండి లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ విషయాన్ని గమనించిన మార్నస్ లబుశేన్ లిఫ్ట్‌ను తెరవడానికి ప్రయత్నించాడు. కానీ అది ఎంతకీ తెరచుకోలేదు. దీంతో ఏం చేయాలో లబుశేన్‌కు అంతు చిక్కలేదు. ఇక చేసేదేమి లేక స్మిత్‌కు తినడానికి కొన్ని చాక్లెట్లు ఇచ్చాడు. ఏకంగా 55 నిముషాలపాటు లిఫ్ట్‌లోనే ఉండిపోయాడు. చివరికి లిఫ్ట్ టెక్నీషియన్ వచ్చి ఆ లిఫ్ట్‌ను బాగు చేయడంతో స్మిత్ క్షేమంగా బయటపడ్డాడు. తనను రక్షించిన లిఫ్ట్ టెక్నీషియన్‌కు స్మిత్ ధన్యవాదాలు తెలిపాడు.
తనకు ఎదురైన ఈ వింత అనుభవాన్ని స్మిత్ ట్విట్టర్‌లో వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. లిఫ్ట్ ఎక్కాక తాను దిగాల్సిన ఫ్లోర్ వచ్చినప్పటికీ లిఫ్ట్ డోర్లు ఓపెన్ అవ్వలేదని, దీంతో లబుషేన్‌కు సమాచారం ఇచ్చానని చెప్పాడు. అయితే అటు నుంచి లబుషేన్ కూడా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపాడు. ఈ సాయంత్రం చాలా ఎంజాయ్ చేయాలని ప్లాన్ వేసుకున్నానని, కానీ తన టైమ్ అంతా లిఫ్ట్‌లోనే అయిపోయిందని చెప్పుకొచ్చాడు. దీంతో తాను బాగా అలసి పోయి, అందులోనే కూర్చుండిపోయినట్లు చెప్పాడు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయినప్పుడు ఇంతకన్నా ఏంచేయగలమని, మీకు ఏదైనా తెలిస్తే చెప్పమని ట్విట్టర్ వీడియోలో అభిమానులను అడిగాడు స్మిత్. దీంతో స్మిత్‌కు కొంతమంది డేవిడ్ వార్నర్ మాదిరిగా ఫన్నీ వీడియోలు చేయాలని సలహా ఇచ్చారు.
కాగా ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు సిడ్నీ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమవుతుంది. యాషెస్ సిరీస్‌ను ఎలాగైనా క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు మాత్రం వరుస వైఫల్యాలతో సతమతమవుతుంది. నాలుగో టెస్ట్ మ్యాచ్‌లోనైనా పుంజుకోని వైట్ వాష్ ప్రమాదం నుంచి తప్పించుకోవాలని భావిస్తోంది.