Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

త‌మిళంలో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ మాక్స్‌వెల్ పెళ్లి ప‌త్రిక‌.. నెట్టింట వైర‌ల్‌

Australian cricketer Glenn Maxwell published his wedding card in Tamil

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆట‌గాడు గ్లెయిన్ మాక్స్‌వెల్ త్వ‌రలో ఇండియాకు అల్లుడు కాబోతున్నాడు. భార‌త్‌లోని తమిళ‌నాడుకు చెందిన వినీ రామ‌న్‌తో 9 ఏళ్లుగా సాగిస్తున్న ప్రేమ‌యాణానికి స్వ‌స్తి ప‌లుకుతూ మూడు మూళ్ల బంధంతో కొత్త జీవితాన్ని ఆరంభించ‌బోతున్నాడు. ఈ మేర‌కు ఈ జంట త‌మిళంలో త‌మ‌ పెళ్లి ప‌త్రిక‌ను ముద్రించడం గ‌మ‌నార్హం. తమిళంలో ముద్రించిన ఈ పెళ్లి ప‌త్రిక ప్ర‌స్తుతం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. దీంతో ఈ పెళ్లి ప‌త్రిక‌ను చూసి మాక్స్‌వెల్‌పై అభిమానులు ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. పెళ్లి ప‌త్రిక ప్ర‌కారం వ‌చ్చే నెల 27న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మాక్స్‌వ‌లె, వినీ రామ‌న్ వివాహం జ‌ర‌గ‌నుంది.

పెళ్లి ప‌త్రిక‌ను బ‌ట్టి చూస్తే వీరి వివాహం త‌మిళ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌ర‌బోతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. మాక్స్‌వెల్ క్రిస్టియ‌న్ కుటుంబానికి చెందిన‌ వాడు కాగా, వినీ రామ‌న్ త‌మిళ కుటుంబానికి చెందిన అమ్మాయి. నిజానికి వీరి వివాహం గ‌తేడాదే జ‌ర‌గాల్సి ఉన్న‌ప్ప‌టికీ కరోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. నిశ్చితార్ధం మాత్రం గ‌తేడాదే జ‌రిగింది. త‌మిళ‌నాడుకు చెందిన వినీ రామ‌న్ త‌ల్లిదండ్రులు ఆస్ట్రేలియాకు వ‌ల‌స‌ వెళ్లారు.

ఇక వినీ రామ‌న్ ఆస్ట్రేలియాలోనే మెడిసిన్ పూర్తి చేసి, అక్క‌డే ప్రాక్టీస్ చేస్తుంది. 2013లో ఓ ఈవెంట్‌లో వినీ రామ‌న్‌ను చూసిన మాక్స్‌వెల్ తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిపోయాడు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రు డేటింగ్‌లో ఉన్నారు. గ‌తంలో తాను ఫామ్ కోల్పోయి జ‌ట్టుకు దూర‌మైన సంద‌ర్భాల్లో వినీ రామ‌న్ త‌న‌కు అండ‌గా నిలిచింద‌ని మాక్స్‌వెల్ ప‌లు సంద‌ర్భాల్లో తెలిపాడు. రామ‌న్ వ‌ల్ల‌నే మాన‌సిక ఒత్తిడి నుంచి బ‌య‌టప‌డి తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చిన‌ట్లు చెప్పుకొచ్చాడు.

IPL 2022 Retention : Kohli Salary Cut Like Dhoni | RCB Captain Mystery || Oneindia Telugu

కాగా త్వ‌ర‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్ల‌నుంది. ఈ పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌కు మాక్స్‌వెల్ దూరంగా ఉంటున్నాడు. పెళ్లి కార‌ణంగానే అత‌ను పాకిస్థాన్ వెళ్ల‌డం లేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఐపీఎల్‌లో మాక్స్‌వెల్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Story first published: Tuesday, February 15, 2022, 8:27 [IST]
Other articles published on Feb 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+