వాట్సప్ గేమ్ ఎంత పనిచేసింది?: నిద్రపోతున్న యువతిని రేప్ చేసిన క్రికెటర్

హైదరాబాద్: వార్చెస్టెర్‌షేర్‌కి చెందిన అలెక్స్ హెప్‌బర్న్ అనే ఆస్ట్రేలియా యువ క్రికెటర్ నిద్రపోతున్న అమ్మాయిని రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడు జో క్లార్క్‌తో కలిసి నిద్రపోతున్న అమ్మాయిపై దాడికి పాల్పడ్డారని కోర్టులో కేసు నమోదైంది.
అలెక్స్ హెప్‌బర్న్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లోని వార్చస్టెర్ షైర్ కౌంటీ క్లబ్‌కు ఆడుతున్నాడు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను అలెక్స్ హెప్‌బర్న్ తిరస్కరించడం విశేషం. బాధితురాలని క్లార్క్ గదిలోకి తీసుకువచ్చాడని.. ఆమె నిద్రించిన తర్వాత హెప్‌బర్న్ అత్యాచారానికి బాధితురాలు కోర్టులో వెల్లడించింది.

వాట్సాప్ గ్రూప్ గేమ్ కారణంగానే
అయితే ఓ వాట్సాప్ గ్రూప్ గేమ్ కారణంగానే ఈ ఘటన జరిగిందని ఈ కేసును వాదిస్తున్న మిరండా మూరే వెల్లడించారు. తాను జో క్లార్క్ గదికి వెళ్లిన వేళ ఈ ఘటన జరిగిందని, ఇద్దరూ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు వాపోయింది. కాగా, ఈ వాట్స్ యాప్ ఆట నిబంధనల ప్రకారం, గ్రూప్ లోని వ్యక్తులు ఎంతమంది అమ్మాయిలతో సెక్స్‌లో పాల్గొన్నారో.. గ్రూప్‌లో పోస్ట్ చేయాలి.

కొంత సమయం తర్వాత
కొంత సమయం తర్వాత, ఎవరు ఎక్కువ సార్లు సెక్స్‌లో పాల్గొంటే వాళ్లే ఈ గేమ్ విజేతలు. ఈ గేమ్ లో గెలవాలన్న ఆలోచనతో హిప్ బర్న్ ఈ పని చేశాడని మూరే తెలిపారు. తదుపరి విచారణ కోసం ఈ వాట్సాప్ గ్రూప్‌కి సంబంధించిన వివరాలను కూడా కోర్టుకు సమర్పించామని ఆమె అన్నారు.

సెక్స్ చేసే సమయంలో
అయితే, ఆరోపణలను ఎదుర్కొంటున్న హెప్‌బర్న్ వాదన మాత్రం మరోలా ఉంది. తాను ఆ అమ్మాయి అంగీకారంతోనే సెక్స్‌లో పాల్గొన్నానని అన్నాడు. సెక్స్ చేసే సమయంలో యువతి మేల్కొనే ఉందని అన్నాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. తదుపరి విచారణ తర్వాత కోర్టు ఈ కేసుపై తీర్పు వెల్లడించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications